Hello Friends ! My special Experience in Media Library Both in Print and Electronic Media.....Indexing of Newspaper Clippings & Indexing of Digital Video Footage etc......for Archive Videos watch this Channel & Please Subscribe My Youtube channel.


9sTV INDIA

తన జన్మ దినం సందర్భంగా స్టేట్ హోమ్ లో ఉన్న 100 మంది విద్యార్థినిలకు ల్యాప్ ట్యాప్ లు అందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్

2 years ago | [YT] | 11

9sTV INDIA

మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.

సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కలిసి కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ గారలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్ గారు, మిఠాయిలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు. కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు

2 years ago | [YT] | 8

9sTV INDIA

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బీ. జనార్దన్ గౌడ్.

3 years ago | [YT] | 12

9sTV INDIA

ముధోల్‌లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ!!

బీఆర్ఎస్ పార్టీలోకి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి. ఇంటికి వెళ్లి ఆహ్వానించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

చేరేందుకు సమ్మతి తెలిపిన రమాదేవి. విఠల్ రెడ్డి గెలుపుకు బాధ్యతాయుతతో కృషి చేస్తానని వెల్లడి.

3 years ago | [YT] | 8

9sTV INDIA

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ తన జన్మదినం సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో చెట్లు నాటారు. పర్యావరణ పరిరక్షనకు, మానవాళి సుఖవంతమైన జీవితానికి, సకల జీవుల కొనసాగింపుకు, జీవ వైవిధ్యత భూమిపై విలసిల్లడానికి చెట్లు ఆధారంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా హరితావరణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న పర్యావరణ వేత్తలకు, వన సంరక్షకులకు ఆకుపచ్చని అవని కోసం తపిస్తున్న ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇలాంటి ఉద్యమిత్వ స్వభావమే తెలంగాణా రాష్ట్రాన్ని పదేళ్ళ స్వల్ప కాలంలోనే ఆకుపచ్చని తెలంగాణాగా మార్చిందని ఆయన గుర్తు చేసారు. మహిళలందరు కలిసి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పే పూల పండుగ బతుకమ్మ కూడా పర్యావరణ స్పృహను ప్రజలలో కలిగించే పండుగేనని, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది బతుకమ్మ పండుగ అని, ఈ సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

3 years ago | [YT] | 3

9sTV INDIA

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధ్వర్యంలో, మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన అంబర్ పేట శంకరన్న..ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు శంకరన్నకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

3 years ago | [YT] | 8

9sTV INDIA

బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్.

పరిగి నియోజకవర్గం నించి పలు మార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ప్రజాభిమానం పొందిన సీనియర్ రాజకీయ నేతగా, ప్రజలకు ఆయన చేసిన సేవలను కేసీఆర్ కొనియాడారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.

హరీశ్వరరెడ్డి కుమారుడు, పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

3 years ago | [YT] | 3

9sTV INDIA

ఆర్టీసీని ప్రభుత్వం లో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.

నా ఆర్టీసి కార్మికులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి. మీ చిరకాల వాంఛ నెరవేర్చినది కేసీఆర్

ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు.

ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టినప్పటి కి ఇవాళ ఆమోదం తెలిపింది.

ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం

నాటి పాలకులు ఆర్టీసి అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారు

మా ప్రభుత్వం ఆర్టీసీకి కార్మికులకు పట్టం కట్టింది. ప్రభుత్వ ఉద్యోగులను చేసింది.

ఇకనుండి కార్మికులు కాదు వారు ప్రభుత్వ ఉద్యోగులు

సీఎం గారు పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతి పక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి.

ప్రజలు పండగ లా భావిస్తే, వారు దండగ అంటున్నారు.

పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు. కాళేశ్వరం కంటే పెద్దది

ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతి పక్షాలు దండగ

నాడు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

మీరు పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారు.

కేసీఆర్ ను ఇంటి మనిషి అని ప్రజలు భావి

3 years ago | [YT] | 4

9sTV INDIA

Migrant Life Reflects in Nishanth’s Stories
- Juluru Gowri Shankar, Chairman, Telangana Sahitya Academy
……………………………………………………………………….
The conflict and the struggle between two different cultures and different social relations have been brought out powerfully by Nishanthh Injam, the author of “The Best Possible Experience” said by Juluru Gowri Shankar, Chairman, Telangana Sahitya Academy. In the mini-function hall, Ravindrabharathi on Sunday the meeting was held and the “The Best Possible Experience” was launched by Juluru Gowri Shankar. On this occasion while speaking he said that the struggles of immigrants and the struggle for their identity is the material for Nishanth’s stories and his writings are a reason for Telangana to be proud of. Through his collection of short stories, Nishanth has shown Telangana awareness to the world. Nishanth residing in America, without forgetting his roots in Telangana he could write stories about human relations and immigrants’ life style and culture in English. A reputed publishing house in America published this collection of short stories and it is a matter of pride to all of us. He feels that Nishanth will grow into a writer that can bring laurels to the country.
Question & Answer Session with Nishanth Injam the Author:
A few literary personalities from the state held a dialogue with Nishanth about his book “The Best Possible Experience”. Professor Konda Nageswara Rao, Osmania University acted as moderator to this Q&A session. Sridala Swamy, a noted English author, Pingali Chaitanya, famous Telugu author interacted with Nishanth. Nishanth said that there are 11 stories in the collection. Out of these 6 are about immigrants’ experiences. Another 5 very sensitively portray human relations. Immigrants try to preserve their memories in place of their lost lives with their near and dear in India. However, the loss can never be compensated. He expresses his wish that his writings could influence in however small fashion Indian society and his writings should lead in helping us thrive as a better society. In this program Pingali Chaitanya said that there has been an undercurrent of grief in many of his stories. Unusual to cliched writing by non-resident Indians Nishanth could write about human relations in a sensitive manner. In this program Vanam Jwala Narasimha Rao, the Chief PRO of CMO, I.V.Ramana Rao, Political Analyst, Namoju Balachari, Secretary, Telangana Sahitya Academy, Pasam Yadagiri, Senior Journalist, Koya Chandramohan, Secretary, Telangana Book Trust, Konduri Veeriah, Senior Journalist, Nelloori Narasimha Rao, Kondapalli Pavan and Jatin participated.

3 years ago | [YT] | 3

9sTV INDIA

Press Note
05-09-2023

ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషి వల్ల 2014లో 30శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు, రెట్టింపు కంటే ఎక్కువ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికంగా నారాయణ్ పేట్ 89శాతం, ములుగు 87శాతం, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84శాతం, వికారాబాద్ 83, గద్వాల్ 85శాతం డెలివరీలు చేసి మంచి పనితీరు కనబర్చాయని అభినందించారు. అతి తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ విషయంలో మొదటి స్థానాల్లో నిలిచిన మెదక్ (84.4), జోగులాంబ గద్వాల్ (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్ కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీం, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు.

ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మంగళవారం నెలవారీ సమీక్ష టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రాథమిక స్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాల భారి నుంచి కాపాడటంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రోగాన్ని ముందుగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నట్లు చెప్పారు. గర్బిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, రూపాయి ఖర్చు భారం వారిపై పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆశా, ఏఎన్ఎంల సేవలు గుర్తించిన సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక వేతనాలును అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా సపోర్టు చేస్తున్నారన్నారు. మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్స్, అమ్మఒడి వాహనాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క గర్బిణి కూడా పరీక్షల కోసం ప్రైవేటుకు వెళ్లొద్దనే ఉద్దేశ్యంతో టిఫా సహా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. దీర్ఘకాలిక రోగాలు, ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న గర్బిణులు గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ సేవలు పొందేలా చూడాలన్నారు. వందశాతం ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.

*వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి...*
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్బిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పాముకాటు, కుక్కకాటు మందులను అన్ని పిహెచ్సీల్లో అందుబాటులో ఉంచామని, ఎక్కడా లేవు అనే మాట రావొద్దన్నారు. సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, జిల్లా వైద్యాధికారులు పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మలేరియా, డెంగీ కేసులు నమోదైతే తక్షణం వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. అవసరమైన చోట ఓపీ సేవలు పెంచాలని, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలందించాలన్నారు.

3 years ago | [YT] | 3