Amaravati Prajarajadhani

The official YouTube channel of the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA), showcasing the vision, planning, and development of Amaravati- the People's Capital of Andhra Pradesh. The channel features updates on infrastructure projects, institutional development, urban planning initiatives, and key milestones shaping the capital region.


Amaravati Prajarajadhani

The foundation stone laying ceremony for Sri LV Prasad Eye Institute in Amaravati marks another significant step towards strengthening the city’s healthcare ecosystem and advancing its planned development. The ceremony will be held on 23 September 2026 at 2:00 PM at Abbarajupalem Village, Thullur Mandal, Amaravati.

#Amaravati #APCRDA #lvprasadeyeinstitute #Healthcare #AmaravatiDevelopment #PeoplesCapital

16 hours ago | [YT] | 86

Amaravati Prajarajadhani

ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు పెదపరిమి గ్రామ రైతులు కటికల సాంబిరెడ్డి & సుందర రామిరెడ్డి గారి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.
✅"LPS 2.O"లోని పెదపరిమి గ్రామ పరిధిలో తమ ఆధీనంలోని 40 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS గారికి గ్రామంలోని యూనిట్ కార్యాలయంలో సోమవారం, 2026 సెప్టెంబర్ 21న వారు అందజేశారు.
✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని సాంబిరెడ్డి, సుందర రామిరెడ్డి గార్లు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.మధుసూదన్, టి.రాధిక పాల్గొన్నారు.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #AndhraPradesh #Pedaparimi #LandPooling #AmaravatiFarmers #FarmersParticipation #LPS #CapitalDevelopment #AmaravatiRising #AmaravatiUnstoppable

1 day ago | [YT] | 119

Amaravati Prajarajadhani

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో "గ్రీవెన్స్ డే" నిర్వహణ..అర్జీలు స్వీకరించిన అడిషనల్ కమిషనర్లు

ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం, 2026 సెప్టెంబర్ 21న "గ్రీవెన్స్ డే" నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IAS, టి. రాహుల్ కుమార్ రెడ్డి IAS గార్లకు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ గ్రీవెన్స్ సెంటర్(సీజీసీ) వద్ద ప్రతి రోజూ పనివేళలలో CRDA సిబ్బంది అర్జీలు స్వీకరిస్తారని..ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో "గ్రీవెన్స్ డే" జరుగుతుందన్నారు. "గ్రీవెన్స్ డే"లో వచ్చిన 31 ఫిర్యాదులలో 19 ఫిర్యాదులు ల్యాండ్స్‌, 5 ఫిర్యాదులు డెవలప్మెంట్ ప్రమోషన్, 7 ప్లానింగ్, సోషల్ డెవలప్మెంట్ తదితర విభాగాలకు చెందినవి.

గ్రీవెన్స్ డేలో డిప్యూటీ కలెక్టర్ & APCRDA గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మేనేజ్‌మెంట్(GRM) నోడల్ అధికారి పి.జయశ్రీ, ఇంజినీర్-ఇన్- చీఫ్ ఆర్.గోపాల కృష్ణారెడ్డి, సోషల్ డెవలప్మెంట్ గ్రూప్ డైరెక్టర్ వి.రాములు, డైరెక్టర్, ల్యాండ్స్ - క్యాపిటల్ సిటీ కె.ఎస్. భాగ్యరేఖ, సర్వే విభాగ డిప్యూటీ డైరెక్టర్ జి.పాండురంగ రామకృష్ణన్, అడిషనల్ డైరెక్టర్(లీగల్) ఎం.వెంకటేశ్వరరావు, ప్లానింగ్ విభాగ డైరెక్టర్ బి. సురేష్ కుమార్, డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ డైరెక్టర్ వి.సునీత, HR విభాగ డైరెక్టర్ బి.మల్లిఖార్జున రెడ్డి, ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, అడిషనల్ డైరెక్టర్(IT) కుశ్వంత్, ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ అంజనా జేమ్స్, అడిషనల్ డైరెక్టర్(LSE) బి.జాన్ బెన్నీ, ADCL నుంచి ఎస్ఈలు కె.శ్రీనివాసరావు, వి.శ్రీనివాస్, డి. విజయకుమార్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె. విజయలక్ష్మి, కె. చెన్నయ్య, ఏ.జి. చిన్నికృష్ణ, ఎం.శేషిరెడ్డి, పి. పద్మావతి, బి. సాయి శ్రీనివాస నాయక్, జి. మురళీధర్, కె.సుధారాణి, పి.కృష్ణారావు, జి, భద్రు, జి. సూర్యనారాయణ రెడ్డి, వి.శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
#FarmersFirst #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AGICL #GrievanceDay #GrievanceRedressal #CitizenServices #Farmers #Rayapudi #AndhraPradesh #APCRDAInitiatives #LPS #LandPooling

1 day ago | [YT] | 35

Amaravati Prajarajadhani

మెన్ హెయిర్ స్టైలింగ్‌లో ఉచిత శిక్షణకు అవకాశం!

✅APCRDA ఆధ్వర్యంలో SRM యూనివర్సిటీ సహకారంతో 2 నెలలపాటు మెన్ హెయిర్ స్టైలింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమం జరగనుంది. రాజధాని అమరావతి గ్రామాలకు చెందిన 18- 50 సంవత్సరాలలోపు పురుషులకు ఈ ఉచిత శిక్షణ అందించనున్నాము.

✅ఈ శిక్షణ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో శిక్షణకు సెలవు ఉంటుంది. ఉచిత శిక్షణలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు పోస్టర్‌లో ఇచ్చిన QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నాము.

✅మెన్ హెయిర్ స్టైలింగ్‌లో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఆసక్తి ఉన్న వారు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
👉రిజిస్ట్రేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2026.

#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #AndhraPradesh #SRMUniversity #FreeTraining #FreeSkillTraining #MenHairStyling #HairStylingTraining #BeautyAndGrooming #GroomingSkills #SkillDevelopment #SkillTraining #VocationalTraining #EmploymentOpportunities #JobsInAmaravati #JobSkills #YouthSkills #SelfEmployment #LivelihoodOpportunities

1 day ago (edited) | [YT] | 26

Amaravati Prajarajadhani

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద వైకుంఠపురంలో 14.36 ఎకరాల భూమి అందజేత.. అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ గారికి అందజేసిన రైతులు

✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు మాదల శ్రీనివాసరావు గారి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. "LPS 2.O"లోని వైకుంఠపురం గ్రామ పరిధిలో తమ ఆధీనంలోని 14.3650 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు సమ్మతి తెలియజేశారు.సంబంధిత అంగీకార పత్రాలను అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ IAS గారికి రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం, 2026 సెప్టెంబర్ 21న వారు అందజేశారు.

✅మాదల శ్రీనివాసరావు గారు 4.3950 ఎకరాలు, మాదల అప్పారావు గారు 4.9850 ఎకరాలు, మాదల రాంబాబు గారు 4.9850 ఎకరాల భూమిని, మొత్తంగా 14.3650 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అందజేసేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.కన్యాకుమారి పాల్గొన్నారు.
#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #AndhraPradesh #Vykuntapuram #LandPooling #AmaravatiFarmers #FarmersParticipation #LPS #CapitalDevelopment #AmaravatiRising #AmaravatiUnstoppable

1 day ago | [YT] | 40

Amaravati Prajarajadhani

Building Today, Computing Tomorrow! 🚀✨

From vision to reality, the Amaravati Quantum Computing Centre is taking shape, strengthening Praja Rajadhani Amaravati’s journey as a hub for deep-tech and quantum innovation.

World-class infrastructure is being developed to support advanced research, technology-driven solutions, and new opportunities for the future.

Key Highlights:

🔹 Cutting-Edge Technology: Dedicated infrastructure for quantum computing and advanced innovation.

🔹 Ecosystem Growth: Supporting startups, academic research, and high-tech career opportunities for youth.

🔹 Knowledge Capital: A significant milestone in Amaravati’s journey towards becoming a global knowledge centre.

Together with citizens, global partners, and technology pioneers, Amaravati is building the future! 🚀

#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #QuantumValley #QuantumTechnology #QuantumComputing #QuantumInnovation #QuantumResearch #KnowledgeCity #AmaravatiUnstoppable #QuantumCapital #QuantumCapitalAmaravati #AmaravatiRising #AGICL #AndhraPradesh

3 days ago | [YT] | 152

Amaravati Prajarajadhani

రాయపూడి APCRDA కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం & అవగాహనా సదస్సు నిర్వహణ

ప్రజారాజధాని అమరావతిలోని రాయపూడి ఏపీసిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏపీ సిఆర్డీఏ సిబ్బంది కోసం బుధవారం, 2026 సెప్టెంబర్ 16న ఉచిత వైద్య శిబిరం & అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈ వైద్య శిబిరంలో లతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సూర్యారావుపేట, విజయవాడకు చెందిన వైద్య బృందంలోని డా. ఎం. వెంకట్, డా. కాంచన రాజ్, డా. శివతేజ, ఇతర వైద్య సిబ్బంది APCRDA అధికారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. వైద్య శిబిరాన్ని APCRDA సోషల్ డెవెలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి. రాములు గారు ప్రారంభించారు. వైద్య శిబిరంలో ప్రాథమిక ఆరోగ్య పరీక్షలైన రక్తపోటు (బీపీ - B.P.), రక్తంలో చక్కెర స్థాయి (బ్లడ్ షుగర్ - R.B.S.), ఆక్సిజన్ స్థాయిలు (పల్స్ ఆక్సిమెట్రీ - SpO₂), బరువు, శరీర ఉష్ణోగ్రత, ఈసీజీ (ECG - గుండె పనితీరు పరీక్ష), నరాల సంబంధిత పరీక్షలు (న్యూరాలజీ అసెస్‌మెంట్), గుండె సంబంధిత ప్రాథమిక పరీక్షలు (కార్డియాలజీ స్క్రీనింగ్), అలాగే సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల ఆధారంగా వైద్యుల ఉచిత సలహాలు మరియు సూచనలు (డాక్టర్ కన్సల్టేషన్) అందజేశారు. మొత్తం 161 మంది ఈ శిబిరంలో వైద్య సేవలు పొందారు.

అనంతరం మధ్యాహ్నం నుంచి ఏపీసిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్‌లో కార్డియోవ్యాస్కులర్ వ్యాధుల గుర్తింపు, నియంత్రణ & సరైన చికిత్స గురించి లతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య బృందంలోని డా. తోట నాగ రఘునందన్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధిత అంశాల గురించి డా. ప్రమోద్ చలసాని గారు APCRDA అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం అవగాహనా కార్యక్రమానికి హాజరైన వారు అడిగిన సందేహాలకు వారు సమాధానమిచ్చారు.

APCRDA సోషల్ డెవెలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి. రాములు గారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ స్పెషలిస్ట్ శ్రీమతి పి. జ్యోతి, ESMU విభాగ సిబ్బంది సమన్వయంతో వైద్య శిబిరం, అవగాహనా సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది.
#APCRDA #APCRDAInitiatives #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #AndhraPradesh #ESMU #FreeMedicalCamp #HealthCamp #HealthAwareness #HealthAwarenessProgram #MedicalCamp #EmployeeWellness #EmployeeHealth #WorkplaceWellness #HealthScreening #PreventiveHealthcare #CardiovascularHealth #HeartHealth #CardiacScreening #StrokeAwareness #BrainStroke #Healthcare #HealthServices

6 days ago | [YT] | 96

Amaravati Prajarajadhani

సృష్టి, నిర్మాణం, శిల్పకళలో విశిష్ట ప్రతిభకు ప్రతీకగా నిలిచే విశ్వకర్మ దివ్య ఆశీస్సులతో సమాజ అభివృద్ధిలో తమ నైపుణ్యంతో, శ్రమతో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాభివందనాలు.

సంప్రదాయ శిల్పకళ నుంచి ప్రజారాజధాని అమరావతి నిర్మాణం వరకు ప్రతి సృష్టిలోనూ, ప్రతి శ్రమలోనూ నైపుణ్యం, సృజనాత్మకత, అంకితభావం ప్రతిఫలించాలని ఆకాంక్షిస్తూ.. APCRDA తరపున శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు!
#VishwakarmaJayanti #Vishwakarma #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AGICL #AndhraPradesh

6 days ago | [YT] | 55

Amaravati Prajarajadhani

A Greener Amaravati!

Amaravati is setting a benchmark for sustainable urban design by seamlessly blending environmental sustainability with economic growth. Envisioned with 30% Blue & Green spaces, Andhra Pradesh’s People’s Capital, Amaravati, offers a clean, eco-friendly environment along with strong potential as an attractive investment destination.

✅ Sustainable Growth: Urban planning integrated with lush green spaces and blue water corridors.
✅ Healthy Living: Expansive public spaces designed for clean air, wellness and modern lifestyles.
✅ Investment Opportunities: Amaravati offers a promising destination for businesses, investors and innovation, with opportunities across key sectors.

Invest in Amaravati — where sustainability meets opportunity. Grow with Amaravati!

#Amaravati #PrajaRajadhani #PeoplesCapital #APCRDA #ADCL #AGICL #AndhraPradesh #GreenAmaravati #SustainableDevelopment #SustainableUrbanDevelopment #BlueGreenSpaces #UrbanDevelopment #GreenInfrastructure #InvestmentOpportunities #InvestmentDestination #InvestInAmaravati #BusinessOpportunities #EconomicGrowth #InfrastructureDevelopment #UrbanPlanning #SustainableGrowth #GlobalInvestment #ChooseSpeedChooseAP #AmaravatiRising #AmaravatiUnstoppable

1 week ago | [YT] | 105

Amaravati Prajarajadhani

రాజధాని అమరావతి యువతకు సువర్ణ అవకాశం!

ప్రజారాజధాని అమరావతిలో నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టిన ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు!

అర్హత:
BSW / MSW (సోషల్ వర్క్‌లో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ)
👉 సోషల్ లేబర్ మేనేజర్‌గా ఉద్యోగ అవకాశాలు
👉 వృత్తి అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత
👉 అర్హత, అనుభవం ఆధారంగా వేతనం
👉 ఉద్యోగ స్థలం: అమరావతి

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 17లోపు పోస్టర్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
#Amaravati #PrajaRajadhani #APCRDA #YouthEmployment #JobOpportunities #SocialWork #SocialLabourManager #EmploymentOpportunities #PeoplesCapital #AndhraPradesh #ADCL #AGICL #AmaravatiRising #APCRDAInitiatives #YouthEmpowerment #CareerDevelopment #AmaravatiYouth

1 week ago | [YT] | 66