మన నేల..మన వార్త.. మన 24TV
----------------------------------------------------------------------------------------------------
24TV Telugu: Politics | Movies | Trending
Stay ahead of the curve with the latest political analysis from Andhra Pradesh, exclusive Tollywood updates, and the internet's most viral stories. Your window to the Telugu world, 24/7.

👉 Subscribe & Hit the Bell Icon to never miss an update!


24TV TELUGU

జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు

పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
#vangaveetiradha #janasena #pawankalyan #vijayawadamayor #vangaveeti #24tvtelugu #vijayawada #bezawada #jsp

2 weeks ago | [YT] | 341

24TV TELUGU

త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

•ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు
•శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ
•దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు

సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
•తీర్వా నదిలో చేపలకి ఆహారం.. వేది వజిపాడు సేవకు విరాళం
శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్టు భక్తులు భావిస్తారు. స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేటికీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గర్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.

1 month ago | [YT] | 2,178

24TV TELUGU

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ఎవరిదీ ?
జెన్యూన్ గా చెప్పండి..!! #bhogapuram #allurisitaramarajuairport #bhogapuramairport #pmmodi #modi #modiji #pawankalyan #ysjagan #chandrababu #cmchandrababu #apcm #poll #publicpoll #vizagairport #vizag #vizianagaram #internationalairport

2 months ago | [YT] | 259

24TV TELUGU

సినీ పరిశ్రమలో నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని కల్పించి నిర్మాతగా నాకు జన్మనిచ్చిన నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ
#PawanKalyan
గారిని కుటుంబ సమేతంగా కలిసి, ఆగస్టు 16న జరగనున్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించి వారి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.

#JananiSuryaPayanam

3 months ago | [YT] | 507

24TV TELUGU

మా YCP పార్టీ వాళ్ళందరూ రౌడీ షీటర్లే😂🤷‍♂️

3 months ago | [YT] | 0

24TV TELUGU

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణాలో పోటీ చేస్తే గెలిపిస్తారా ?

#pawankalyan #janasena #janasenaparty #telangana #telanganapolitics #tspolitics #pspk #telangananews

4 months ago | [YT] | 1,902

24TV TELUGU

శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి,

అనంతరం రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు...

5 months ago | [YT] | 820

24TV TELUGU

HBD Akira Nandan
Wishing the young and talented Our Power Legacy #AkiraNandan a very Happy Birthday🎉
Have a fantastic year ahead filled with loads of love and happiness! ❤️
#HappyBirthdayAkiraNandan #HBDAkiraNandan #AkiraNandan #akira #PawanKalyan

6 months ago | [YT] | 368