RURAL MEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Trends, Rural Skills and traditions and their products.Culture, Success Stories, which are deviant and out of the ordinary.
RURAL MEDIA is your one stop destination to uncovering the answers to all.
And anyone can contribute to RURAL MEDIA. Shoot for us, report for us,
your material is welcome so long as it meets the standards of this Channel and falls within our mandate, the everyday lives of everyday people.
Subscribe to the New Emerging World Of Journalism today,
youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_…
With love
ShyamMohan,Editor
#Ruralmedia
email : smrm5858@gmail.com




Rural Media

ఇక్కడ అడుగు పెడితే... రైతుగా మారడం పక్కా !
..............................................................................................
‘వ్యవసాయంలో ఏం మిగులుతుంది..? పెట్టుబడులు పెరుగుతున్నాయి.. పంటకు ధర రావడం లేదు..’ ఇది నేటి యువతలో చాలామంది చెప్పే మాట.
కానీ... అదే యువకుడు ఒకసారి ఈ పది ఎకరాల పొలంలోకి అడుగుపెడితే మాత్రం అతని ఆలోచన పూర్తిగా మారిపోతుంది.
ఇక్కడ పంటలు మాత్రమే కనిపించవు.విత్తనం నుంచి మార్కెట్ వరకు ఒక రైతు ప్రయాణం కనిపిస్తుంది.

9 hours ago | [YT] | 20

Rural Media

What if your children could receive 100% free education from Class 6 to Post Graduation without spending a single rupee?
Imagine an institution where quality education, comfortable accommodation, nutritious food, clothing, books, and other essential facilities are provided completely free of cost!
Along with academics, students are trained in life skills, discipline, arts, sports, and social service. https://youtu.be/RLqU2Bd47Ic

2 days ago | [YT] | 5

Rural Media

మీ పిల్లలకు ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు... ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చదువు చెప్పిస్తే ఎలా ఉంటుంది?
ఇక్కడ నాణ్యమైన విద్య, చక్కని వసతి, పౌష్టికాహారం, దుస్తులు, పుస్తకాలు... అన్నీ ఉచితమే!
చదువుతో పాటు, నైపుణ్యాలు, క్రమశిక్షణ,కళలు, క్రీడలు, సేవాభావం స్తారు,
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ విద్యా సంస్థ ఎక్కడుంది? మీ పిల్లలకు ప్రవేశం ఎలా లభిస్తుంది? ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి?ఎలాంటి అర్హతలు ఉండాలి?పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ... https://youtu.be/RLqU2Bd47Ic

3 days ago | [YT] | 12

Rural Media

ఈ నెలంతా భద్రాచలం మన్యంలోనే మా షూటింగ్...
ఏ మీడియా చూడని ఆవాసాలు, చెప్పని కథలను క్యాప్చర్ చేయబోతున్నాం.

1 week ago | [YT] | 13

Rural Media

మనుషుల మధ్య ఒక ప్రేమ విత్తనం !
.............................................................................
కొన్ని సినిమాలు వినోదాన్ని, మరికొన్ని ఉత్కంఠతను రేకిత్తిస్తాయి కానీ, చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలు మనలోని మనిషిని తట్టిలేపుతాయి. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు, మానవత్వం గురించి ఆలోచింపజేస్తాయి.
ఈ సినిమాలోని గొప్పతనం కేవలం కథలోనో, పాత్రల చిత్రణలోనో లేదు. మనుషుల్ని మనుషులుగా చూడగలిగే హృదయం ఎంత ముఖ్యమో గుర్తుచేయడంలో ఉంది. మనిషి రూపం, అతని గతం, సమాజంతో అతడు వ్యవసహరించే తీరు ఆధారంగా ఒక అభిప్రాయానికి వచ్చేయడం ఎంత తప్పో ఈ సినిమా మానవీయ శైలిలో చెబుతుంది.
ఈ Film లో ఎనిమిదేళ్ల పిల్లగాడు శబరి పాత్రలో నటించిన తీరును అతడిలోని ఎమోషన్స్‌ని, ప్రతిభను చూస్తున్నపుడు మనం ఉధ్వేగానికి లోనవకుండా ఉండలేము. బాలనటుడిగా నటిస్తున్నాననే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. భయం, అమాయకత్వం, ఆసక్తి, జాలి, ఎదుటివారిని అర్థం చేసుకోవాలనే తపన.. ఇలా ఒక చిన్నారి మనసులోని సహజమైన భావోద్వేగాలను ఎంతో సహజంగా పలికించాడు. ముఖ్యంగా ఒక స్టార్ హీరోతో కలిసి నటించిన సన్నివేశాల్లో అతని అభినయం మామూలుగా ఉండదు. పెద్ద నటుడి ముందు నటిస్తున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా తనదైన ముద్ర వేయడం విశేషం.
ఇక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తూనే, మనసులోని సున్నితమైన భావాలను ఆవిష్కరించిన తీరు అద్భుతం. కోపం, ఆధిపత్యం, అహంకారం వంటి లక్షణాల వెనుక దాగిన ఒంటరితనాన్ని, ఆప్యాయత కోసం పరితపించే మనిషిని ఆయన నటనలో చూసి తీరాలి. పెద్ద పెద్ద డైలాగులు లేకుండానే కళ్లతో, ముఖ కవళికలతో భావాలను పలికించగల ఆయన నటనా ప్రతిభకు ఈ సినిమా మరో నిదర్శనం.
దర్శకుడు బాలాజీ తరణీధరన్ ఒక చిన్నారి, ఒక గ్యాంగ్‌స్టర్ మధ్య ఏర్పడే అనూహ్యమైన అనుబంధాన్ని కథకు కేంద్రంగా తీసుకున్నారు. హాస్యం, భావోద్వేగం రెండింటినీ సమతూకంతో నడిపించారు. కుటుంబ బంధాలు, భార్యాభర్తల అనుబంధం, పిల్లల పట్ల పెద్దల బాధ్యత లాంటి అంశాలను కూడా కథలో అందంగా మేళవించారు.
ఈ సినిమా చెప్పే ఒక అరుదైన సందేశం ఏమిటంటే.. మనిషిలోని మంచితనాన్ని గుర్తించడానికి అతని గతాన్ని మాత్రమే చూడకూడదు. అతడిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఒక చిన్నారి చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఒక మనిషిలో ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. భయం కంటే ఆప్యాయత శక్తిమంతమైనది.
నేటి సమాజంలో మనుషుల మధ్య పెరుగుతున్న దూరాలు, అపనమ్మకాలు, అసహనం మధ్య ఇలాంటి సినిమాలు రావడం చాలా అవసరం. ఎందుకంటే మనిషికి చివరకు కావాల్సింది అధికారం కాదు.. ప్రేమించే మనుషులు, ఆప్యాయంగా పలకరించే హృదయాలు.
బత్తా (BATHTHA) వినోదంతో పాటు మనసుకు హత్తుకునే మానవీయ అనుభూతిని అందించే మంచి సినిమా. మనిషిలోని మనిషిని మేల్కొలిపే ప్రయత్నం.
ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి చెప్పం . చూసి తీరాలి అంతే!
ఈ సినిమాకు నేషనల్ అవార్డు రాకపోతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆస్కార్ ఆవార్డు రాకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అవార్డులకు అందని సత్తా ఈ ‘బత్తా’ లో ఉంది!

1 week ago | [YT] | 5

Rural Media

ఓ చిన్న గ్రామం నుంచి మొదలైన ఓ సేవా కార్యక్రమం... నేడు వంద దేశాలకు విస్తరించింది!
‘ఒకే ప్రపంచం ఒకే కుటుంబం’ పేరుతో సాగుతున్న ఈ మిషన్ లక్ష్యం ఏమిటి?
నాణ్యమైన విద్య, వైద్యం తో పాటు ప్రతి బిడ్డకూ పౌష్టికాహారం ఉచితంగా ఎలా అందింస్తున్నారు ? ఈ బృహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్నది ఎవరు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు రూరల్ మీడియా కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా, ముద్దెనహళ్లికి వెళ్లింది. https://youtu.be/5ItFbeSrBp4

1 week ago | [YT] | 6

Rural Media

ఇక్కడ అరగంటలో 200 జొన్న, సజ్జ రొట్టెలు ఎలాచేస్తారో చూడండి https://youtu.be/f5xW_JPuM3k

1 week ago | [YT] | 5

Rural Media

ఉదయం 6 దాటింది. తొలి చలి తగులుతోంది.
అసిఫాబాద్‌లో వేడిగా ఇడ్లీ తిని నంబాల పల్లె వైపు బయలు దేరాం. ‘ వాళ్లంతా ఒకపుడు కుట్లు ,అల్లికలు, గొర్రెల పెంపకం మీద బతికిన పేద మహిళలు ఇపుడు ఎండను ఆదాయంగా మార్చుకున్నారు.’ అని కారు డ్రైవ్ చేస్తున్న మల్లేష్ ( ఎపిఓ రూరల్ డెవలప్ మెంట్) ఇంట్రస్టింగ్ లీడ్ చెప్పారు.
గంట తరువాత పలచని అడవిలోకి వచ్చాం. దారి సరిగా లేదు. వాహనం ఆపి కాలి బాటలో బయలు లోపలకు నడిచాక 8 ఎకరాల్లో సముద్రపు అలల్లా మెరుస్తూ సోలార్ ప్యానల్స్ కనిపించాయి. వాటి మధ్య మహిళలు పనిచేస్తున్నారు.
ఎల్‌నినో వేడి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ మధ్య సోలార్ విద్యుత్ ఎందుకు ఉత్పత్తి చేస్తున్నారో మాకు వివరిస్తూ లాభ నష్టాలను చెప్పారు. మహిళా సాధికారత అనే గంభీరమైన పదానికి సరళమైన అర్ధం ఇదే!

1 week ago | [YT] | 12

Rural Media

ఇప్ప పువ్వుతో ఆ జబ్బులన్నీ పోతాయా? అడవి పూల రహస్యం ఇదిగో... https://youtu.be/SLi6bg0El_0

1 week ago | [YT] | 3