🏹 ధర్మం 🔥 న్యాయం 🏹!

🇮🇳 మీకు తోడు 🇮🇳


MANA True News

singer మంగ్లీ చుట్టూ వివాదాల ముసురు!
ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీకి భారీ షాక్! మైక్రో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో నిరుపేదలను మోసం చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఆమెపై వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
కీలక వివరాలు:
మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
ఆమెను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
బాధిత నిరుపేదలకు న్యాయం జరిగే వరకు మంగ్లీని ఇండస్ట్రీ నుంచి దూరంగా పెట్టాలనే డిమాండ్‌పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.
#SingerMangli #MangliControversy #MicrofinanceScam #TeluguSinger #TollywoodNews #TelanganaCinema #MAA #JusticeForVictims #TrendingNow #BreakingNewsTelugu

6 months ago | [YT] | 0

MANA True News

శ్రీకృష్ణుడు ఫోటో పెట్టినందుకు శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపిన కేరళ పోలీసులు.

కేరళలో తన హోటల్ ప్రమోషన్ కోసం చికెన్ బిర్యానీ తింటున్న చిన్ని కృష్ణుడు ఫోటో వాడిన మెహర్ మండి & గ్రిల్స్ యజమాని అర్షద్‌.
అర్షద్‌ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కేరళ పోలీసులు.

చెర్తలలోని మనోరమ జంక్షన్ సమీపంలో ఉన్న 'మెహర్ మండి & గ్రిల్స్' కోసం ఈ ఫోటో వాడిన అర్షద్‌..!?
#truenews

6 months ago | [YT] | 0

MANA True News

రాంగ్‌రూట్‌లో ప్రయాణం ఎన్నటికైనా మీకు ప్రమాదమే అని గుర్తుంచుకోండి. కొద్దిపాటి దూరమైన సరే రాంగ్‌రూట్‌లో ప్రయాణం చేయొద్దు. మీరు చేసే పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. సరైన మార్గంలో ప్రయాణం చేయండి. క్షేమంగా గమ్యం చేరండి.
#TelanganaPolice #RoadSaftey #tvtruenews

6 months ago | [YT] | 0

MANA True News

మనం ఉన్నది భారతదేశంలోనా లేక పాకిస్తాన్ లోన!!

దేశ భవిష్యత్తు కోసం, పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఆర్.ఎస్.ఎస్ (RSS) శాఖను కొందరు కుహానా వాదుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి అడ్డుకోవడం అత్యంత విచారకరం.

భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అనే నినాదాలు వింటే కొందరికి చెవులు నొప్పిపుడుతున్నాయట!

రోజుకు ఐదుసార్లు మసీదుల లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని మేము భరిస్తున్నప్పుడు, కేవలం ఒక గంట పాటు జరిగే శాఖను, అందులో వినిపించే దేశభక్తి నినాదాలను భరించలేకపోవడం వారి అసహనానికి నిదర్శనం.

మేము అక్కడికి చేరుకుని శాఖను నిర్వహించి తీరాలని నిశ్చయించుకున్నాం. మన దేశంలో మన నినాదాలు చేసుకోవడానికి కూడా అభ్యంతరాలా? దేశభక్తి నినాదాలు వినలేకపోయే వారు ఈ దేశంలో ఎలా ఉండగలరు?

సమానత్వం అనేది అందరికీ వర్తించాలి. మా సంస్కృతిని, దేశభక్తిని కాపాడుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం.
🚩 భారత్ మాతా కీ జై! 🚩
🚩 జై శ్రీరామ్! 🚩

6 months ago | [YT] | 0

MANA True News

గాడ్ బ్లెస్ డాక్టర్ రాజశేఖర్ & ఫ్యామిలీ!!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

మొన్న హీరో రాజశేఖర్ గారింటికి వెళ్ళినప్పుడు నాకు చాలా రోజులు గుర్తుండిపోయేంత మంచి ఫీలింగ్ కలిగింది. అది మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను!!

అప్పటికే డోర్స్ ఓపెన్ చేసి ఉంచిన జీవితగారు మమ్మల్ని చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టారు. అక్కడున్న పెద్ద పెద్ద సోఫాలకు తోడు అదనంగా కుర్చీలు వేయడంలో తమ సహాయకురాలికి తను కూడా సహాయం చేస్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంతలో వాళ్ళ రెండో అమ్మాయి (శివాత్మిక) వచ్చి అందరికీ నమస్కారాలు చేసి, ట్రేతో మంచినీళ్లు తెచ్చింది. ఈ ప్రేమపూర్వక ఆతిధ్యంతోనే మేమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే... రాజశేఖర్ గారు నవ్వుతూఎంట్రీ ఇచ్చారు!!

అందరం లేచి ఆయనతో కరచాలనం చేసి, "బైకర్"తో మంచి "కమ్ బ్యాక్" ఇచ్చిన ఆయన్ను అభినందించాం. రాజశేఖర్ గారు అందరినీ పేరుపేరునా పలకరిస్తుండగానే... జీవితగారు, శివాత్మిక... బెల్లం పాకం జీడిపప్పు, మిక్చర్ తీసుకువచ్చారు. "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" గౌరవాధ్యక్షులు ప్రభుగారు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి సారధ్యంలో డాక్టర్ రాజశేఖర్ ను అభినందించి.... ఫోటోలు తీయించుకున్నాం. మాలో ఫోటోలు తీసేవాళ్ళు ఫోటోల్లో మిస్సవుతున్నారని... ఫోటోలు తీసే బాధ్యత శివాత్మిక తీసుకుంటే నాకు భలే ముచ్చటేసింది!!

కెరీర్ బిగినింగ్ నుంచి తననెరిగిన సీనియర్ జర్నలిస్టులు బాల్ రెడ్డి గారు, మోహన్ గోటేటి గారు, మామిడిపల్లి గిరిధర్ గారు తదితరులతో కలిసి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు రాజజీఖర్. "రేపటి పౌరులు, ప్రతిఘటన, వందేమాతరం, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, మగాడు" నాటి రోజులు నెమరువేసుకుంటూ ఉండిపోయారు. ఆయా సినిమాలను నేను ఏ ఊర్లో, ఏ థియేటర్లో చూశానో గుర్తుకు తెచ్చుకుంటూ ఉండిపోయాను. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాల విశేషాలు, వెల్లువలా వస్తున్న ఆఫర్స్ గురించి మాతో పంచుకున్నారు. పెద్దమ్మాయి శివాని షూటింగ్ లో ఉందా అని అడిగితే... లేదు అపోలోలో తన అప్రెంటిస్ చేస్తోందని చెప్పారు. సినిమాలు చేస్తూనే "ఎమ్.బి.బి.ఎస్" చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అనిపించింది. ఇంతలో జ్యూస్, కాఫీ, టీలు కూడా జీవిత గారే స్వయంగా తీసుకురావడం నా మనసును మరింత కదిలించింది!!

మేము రాజశేఖర్ గారి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జీవితగారిని నిశితంగా గమనించకుండా ఉండలేకపోయాను. ఆమె "సింప్లిసిటీ" నన్ను కట్టిపడేసింది.
ఒక సాధారణ మధ్య తరగతి గృహిణిలానే అనిపించారు తప్ప... "సెలబ్రిటీ స్టేటస్" ఆమెలో అస్సలు కనిపించలేదు. తానొక ప్రముఖ హీరోయిన్ అని కానీ, డైరెక్టర్ అని కానీ ఆమెకు కొంచెం కూడా స్పృహ లేదు. తమ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చిన తమ శ్రేయోభిలాషుల్ని రిసీవ్ చేసుకున్నట్లే అనిపించింది. గత పాతికేళ్లుగా మీడియాలో ఉంటున్న నాకే... మీడియా ద్వారా వాళ్లకు ఏర్పడిన "ఇమేజ్" ఇసుమంత కూడా కనిపించలేదు అక్కడ ఉన్నంతసేపు!!

మా భేటీలో జీవితగారిని కూడా మాతో జాయిన్ అవ్వమని ఒకటికి రెండుసార్లు అడిగినా.... ఆమె అతిధి మర్యాదలతోనే బిజీగా ఉండిపోయారు. రాజశేఖర్ గారు మాతో ముచ్చటిస్తుండగా... శివాత్మిక మధ్యలోకి వచ్చి వాళ్ళ నాన్న షర్ట్ కాలర్ సరి చేస్తుంటే.... నాకు మా అమ్మాయి గుర్తొచ్చి, ముద్దొచ్చింది!!

ఆరోజు... అప్పటికి కాసేపట్లో "బైకర్" సక్సెస్ మీట్ ఉందన్న విషయం మర్చిపోయి మరీ రాజశేఖర్ గారు మాతో ముచ్చటిస్తూనే ఉన్నారు. కానీ, ఆ విషయం మేమే గుర్తు చేసి, విడివిడిగా రాజశేఖర్ గారితో ఫోటోలు తీయించుకుని, సెలవు తీసుకున్నాం!!

రాజశేఖర్ గారు లిఫ్ట్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపడం నా మనసుకు హత్తుకుపోయింది. అదే "హైలైట్" అనుకుంటే... ప్రభుగారు మర్చిపోయిన సెల్ ఫోన్ ను... పనమ్మాయితో పంపించడం కాకుండా... శివాత్మిక స్వయంగా కిందకు తీసుకువచ్చి ఇవ్వడం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది!!

6 months ago | [YT] | 0

MANA True News

వివిధ ప్రాంతాలనుంచి hyd చూడటానికి వచ్చిన టూరిస్టులను ఫిలిం నగర్ కు తీసుకెళ్లారు. వారితో వచ్చిన గైడ్ అక్కడి విశేషాలను వివరిస్తూ "అది ఫలానా హీరో బంగాళా... అది ఫలానా హీరోయిన్ మహల్...అది ఆ డైరెక్టర్ నివాసం" అంటూ ఒక పదిమంది బంగళాలు చూపించిన తరువాత ఒక టూరిస్ట్ "అన్నీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లేనా? నిర్మాతల బంగళాలు ఎక్కడ?" అడిగాడు. గైడ్ నవ్వి "నిర్మాతల నివాసాలు అమీర్ పేట, యూసుఫ్ గూడ దగ్గర చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లో ఉంటాయి." అని చెప్పాడట!

నిజమే మరి...ఒకప్పుడు అద్భుతమైన కళాఖండాలు తీసిన జగపతి రాజేంద్రప్రసాద్ చివరకు ఎంత ఆస్తులు మిగుల్చుకున్నారు? ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలు ఇప్పుడు ఎక్కడ.. ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారో ఎంతమందికి తెలుసు?

నాలుగురోజుల క్రితం ఏదో పత్రికలోచదివాను...ఫలానా హీరో 20 కోట్లు పెట్టి కారు కొన్నాడు...ఆయనకు ఇప్పటికే పదహారు కార్లున్నాయి." "రెండు మూడేళ్ళక్రితం వచ్చిన ఒక హీరోయిన్ కు భారతదేశంలోని మహానగరాల్లో ఎనిమిది బంగళాలు ఉన్నాయట...పద్దెనిమిది కార్లు ఉన్నాయట...ఆమె హ్యాండ్ బాగ్ లక్షన్నరట!

అది సరే...మరి వారితో సినిమాలు తీసిన నిర్మాతకు ఎన్ని కార్లు ఉన్నాయి? సినిమా తీసి ఉన్న ఇల్లూవాకిలి, కార్లు స్థలాలు అమ్ముకునే నిర్మాతలే ఎక్కువ మనకు.
ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే చిన్నహీరో సినిమాలు మంచి కలెక్షన్లు వస్తున్నా ఎత్తేస్తారు. ఒకప్పుడు ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు సినిమాలు పోటాపోటీగా విడుదల అయ్యేవి. ఒక హీరో సినిమా కోసం మరొక చిన్న హీరో సినిమా విడుదలను ఆపిన ఉదంతం ఉన్నదా? 30లక్షల బడ్జెట్ సినిమా విడుదల అయినా, 90 లక్షల బడ్జెట్ సినిమా విడుదల అయినా టికెట్ ధరల్లో మార్పు ఉండదు. మరి ఇప్పుడు అగ్రహీరోల సినిమాలకు వారం రోజులు ధరలు ఎందుకు పెంచాలి? బడ్జెట్ ఎక్కువైంది అంటారు నిర్మాతలు. బడ్జెట్ ఎక్కువ పెట్టమని ప్రేక్షకులు వారిని అడిగారా? వందకోట్లతో సినిమా తియ్యమని ఏ ప్రేక్షకుడు నిర్మాతలను బ్రతిమాలాడు? ఒక్కొక్క హీరోకు యాభై కోట్లు ఇవ్వమని ప్రేక్షకులు డిమాండ్ చేశారా?

ఒకప్పుడు ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదనరావు, కె విశ్వనాధ్, దాసరి నారాయణరావు, జంధ్యాల, సృజనాత్మక దర్శకులుగా పేరొందారు. అందరూ కొత్తవారితో సినిమాలు తీసి అఖండవిజయాలు సాధించారు. నేటి దర్శకులు గ్రాఫిక్స్ ను నమ్ముకుని కోట్లాదిరూపాయలు తగలేస్తున్నారు. బడ్జెట్ పెంచుతూ నిర్మాతలను ముంచుతున్నారు.

ఒకప్పుడు సినిమా కనీసం నాలుగు వారాలు ఆడేది. సక్సెస్ అయితే యాభై రోజులు, హిట్ అయితే వంద రోజులు, రిపీటెడ్ రన్ ఉండేది. పాతాళభైరవి, దేవదాసు, కన్యాశుల్కం లాంటి సినిమాలు రీ రిలీజ్ లో శతదినోత్సవాలు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లవకుశ సినిమా ప్రదర్శించని సినిమా టాకీస్ లేదు. లవకుశ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, ఆడిన రోజులను విశ్లేషించి ఒక్కొక్క ప్రేక్షకుడు ఇరవై రెండు సార్లు చూశారని లెక్కలు గట్టారు. మరి ఈనాటి సినిమాలను ఎంత హార్డ్ కొర్ ఫ్యాన్ అయినా రెండోసారి చూస్తున్నాడా? అసలు ఎంత పెద్ద సినిమా అయినా రెండో వారం పోస్టర్ కనిపిస్తున్నదా?

సంవత్సరానికి పెద్ద హీరోల సినిమాలు మహా అయితే పది పన్నెండు వస్తాయి. తొంభై సినిమాలు చిన్న హీరోలవి. కాబట్టి వీలైనంతవరకు చిన్న హీరోల సినిమాలు మాత్రమే ప్రదర్శించెట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రోత్సహించదలచుకుంటే చిన్న హీరోల సినిమాలకు పన్నులే వసూలు చెయ్యొద్దు. సినిమా హాళ్ల మీద వచ్చే ఆదాయం లేకపోతె ప్రభుత్వమేమీ కూలిపోదు. సినిమాలు మళ్ళీ యాభై రోజులు, వందరోజులు ప్రదర్శించబడే వాతావరణం రావాలి. *వందకోట్లతో ఒక్క సినిమా తీస్తే వంద కుటుంబాలు బతుకుతాయి. వందకోట్లతో వంద సినిమాలు తీస్తే పదివేల కుటుంబాలు బతుకుతాయి. మళ్ళీ సినిమాహాళ్లు ఫ్యామిలీ ఆడియన్స్ తో కిటకిటలాడుతాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసుకోమనండి. వందలకోట్లను గడించమనండి

అన్ని పరిశ్రమలకు ఉన్నట్లే సినిమారంగానికి కూడా కష్టనష్టాలు ఉంటాయి. ఉత్పత్తిరంగంలోని పరిశ్రమలకు, సినిమా పరిశ్రమకు చాలా తేడా ఉంది. సినిమారంగం కష్టాలకు మి స్వయంకృతమే కారణం.

ఒక సినిమాలో నటించినందుకు ఒక హీరోకు 100 కోట్లవరకు పారితోషికాలు పెంచేస్తున్నారు. ఎందుకు ?

ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రహీరోలు లక్షరూపాయలు పారితోషికానికి చేరడానికి పాతికేళ్ళు పట్టింది.

సినిమా నిర్మించడానికి డబ్బు కుమ్మరించేది నిర్మాత. అలాంటి నిర్మాత హీరో ఇంటిముందు దర్శనం కోసం ఆత్మను చంపుకుని పడిగాపులు పడతాడు!

ఇక పాటల చిత్రీకరణ అంటూ పదిదేశాల్లో చేస్తారు. హీరో హీరోయిన్లు పల్లెటూరి నేపధ్యం అయినా సరే, పాటలు అంటే విదేశాలు వెళ్లారు. లొకేషన్స్ చూడటానికి ఎవ్వరూ సినిమాలు చూడరు. ఇటీవల వచ్చిన Little Hearts.. Raju weds Rambai..ఏ విదేశాలను చూపించారు?

సినిమా అనేది నిర్మాత రెక్కల కష్టం. అతని కష్టంతో కనీసం వంద కుటుంబాలు జీవిస్తాయి. CM gariki సినిమారంగం గూర్చి తెలియకపోవచ్చు. ఈ హీరోలు, నిర్మాతలు వెళ్లి CM garini కలిసి తమ కష్టాలు చెప్పుకుంటే వారి పరువుకు భంగమా? లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే కుబేరులు సైతం ముఖ్యమంత్రులను కలిసి వారి ప్రాజెక్టుల గూర్చి వివరంగా చెప్పుకుంటారు.

సినిమా టికెట్ ధరలు పెంచడం వలనే సామాన్య మధ్యతరగతి వారికి సినిమా వినోదం దూరమైంది. మధ్యతరగతి వారు ధియేటర్ ముఖం చూడటం మానేశారు. అందులో ఇప్పుడు ఇంట్లోనే ఓటిటి, యు ట్యూబ్ లాంటి అనేక సాధనాలు ఉన్నాయి. సినిమాలు చూడటానికి శ్రమపడి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

నిర్మాతలు ఈ లోకంలోకి వచ్చి.. ముందుగా సినిమా నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించుకోవాలి. కొత్త నటీనటులను, దర్శకులను తయారు చేసుకోవాలి.

సినిమా అనేది చౌకలో లభించే వినోదం అనేది మన పెద్దలు చెప్పిన మాట. ఆ ధరలు ఉంటేనే మళ్ళీ సినిమాలు యాభై రోజులు, వందరోజులు నడుస్తాయి. వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. ఎవరో డజను మంది హీరోలను వేల కోట్లాధిపతులను చెయ్యడానికి సినిమా పరిశ్రమను చంపవద్దు.
ఇంతపొందిన మీరు తిరిగి అమాయక బీద ఇతరకులాల జనానికి ఏమిచ్చారు? సిగరెట్లు, మందు, ఆడపిల్లలని లైన్లో వేయడం, పడకపోతే వేధించడం, వెకిలితనాలూ, బూతుసాహిత్యాలూ..డ్రగ్స్, వ్యభిచారం,

బయట ఎంతమంది ప్రతిభగలవాళ్లు, ఎంతమంది అవకాశం కోసం ఎదురుచూసేవాళ్ళు.. మీకోసం తమ జీవితాల్ని బలిపెట్టుకున్నారో మీకు తెలియదా?

మిగిలిన సినిమా హాళ్ల యజమానులు ఇప్పటికే తమ హాళ్లని కల్యాణ మండపాలుగా మల్చుకున్నారు. సైకిల్ స్టాండ్ కుర్రాడు వేరే వ్యాపారం పెట్టుకున్నాడు. కొత్త కుర్రాళ్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడం కోసం తొక్కులాడుతున్నారు.

సినిమా ప్రజాస్వామీకరణ చెందాల్సిందే, అందరికీ అవకాశాలు వుండాల్సిందే...
🙏🙏🙏

#filmindustry
#viralnews
#newsupdates

6 months ago | [YT] | 0

MANA True News

*​📌 నేటి అంశం: మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే? - నిందితుడికి రాజ్యాంగం కల్పించిన 'టాప్ 5' హక్కులు*

​చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే. ఏదైనా కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. అవేంటో తెలిస్తే మీరు చట్టపరంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
​✅ 1. అరెస్ట్ కారణం తెలుసుకునే హక్కు (Article 22(1)):
మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అడిగే హక్కు మీకు ఉంది. పోలీసులు కచ్చితంగా అరెస్ట్ మెమో (Arrest Memo) తయారు చేయాలి. అందులో అరెస్ట్ చేసిన సమయం, తేదీ మరియు కారణం స్పష్టంగా ఉండాలి.
​✅ 2. మౌనంగా ఉండే హక్కు (Right to Silence):
విచారణ సమయంలో పోలీసులు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాలని లేదు. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నేరస్తుడిగా నిరూపించుకునేలా (Self-incrimination) ఉండే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండే హక్కు మీకు రాజ్యాంగంలోని అధికరణ 20(3) కల్పిస్తుంది.
​✅ 3. 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం (Section 58 BNSS):
పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రయాణ సమయాన్ని మినహాయించి, 24 గంటల లోపు సమీపంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. అంతకంటే ఎక్కువ సమయం ఉంచితే అది చట్టవిరుద్ధ నిర్బంధం అవుతుంది.
​✅ 4. వైద్య పరీక్షలు చేయించుకునే హక్కు (Section 53/54 CrPC - Now BNSS):
అరెస్ట్ అయిన సమయంలో నిందితుడికి గాయాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు (Medical Examination) చేయించుకునే హక్కు ఉంది. ఇది విచారణ పేరుతో పోలీసులు హింసించకుండా (Custodial Torture) అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది.
​✅ 5. ఉచిత న్యాయ సహాయం (Free Legal Aid):
ఒకవేళ అరెస్ట్ అయిన వ్యక్తి లాయర్‌ను పెట్టుకోలేని ఆర్థిక పరిస్థితిలో ఉంటే, రాజ్యాంగంలోని అధికరణ 39A ప్రకారం ప్రభుత్వం తరపున ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు అతనికి ఉంటుంది.
​న్యాయ సలహాలు - చట్టపరమైన అవగాహన కోసం మాత్రమే.



#RK Kambagiri Swami
#National vice chairman
#International Human Rights federation IHRF

6 months ago | [YT] | 0

MANA True News

సల్కం చెరువును కబ్జా చేసి కట్టిన ఒవైసీ కాలేజీల మీద హైకోర్టు కొరడా ఝుళిపించింది!
​కోర్టు ఆదేశాలివే: 1. కాలేజీ ఆక్రమణలో ఉందని బోర్డులు పెట్టండి.
2. విద్యార్థుల అడ్మిషన్లు 'ఓన్ రిస్క్' మీదనే.
3. కొత్త కట్టడాలు కట్టడానికి వీల్లేదు.

​ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదవాడి ఇల్లు కూల్చడానికి నిమిషం పట్టదు, కానీ ఈ 'బడా' నేతల ఆక్రమణలు కూల్చడానికి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వణికిపోతున్నారా? హైడ్రా (HYDRAA) బుల్డోజర్లు కేవలం పేదల ఇళ్లకే పరిమితమా? సామాన్యుడికి ఒక న్యాయం.. సాలార్లకు ఒక న్యాయమా? చట్టం అమలులో ఈ వివక్ష ఎందుకు?
​
ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30, 2026న జరగనుంది. ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి నివేదిక సమర్పిస్తుందో దాన్ని బట్టి చర్యలు ముందుకు సాగుతాయి

6 months ago | [YT] | 0

MANA True News

హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారి కుమారుడు సందీప్ వీడియో వైరల్...

ప్రత్యేకమైన మాట్లాడే శైలితో కస్టమర్లను ఆకట్టుకున్న సందీప్..

వీడియో చూసి ఆకర్షితుడైన డాక్టర్ ఎం. రమేష్..

సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి సందీప్‌ను పిలిపించిన సీపీ.
ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేస్తున్న యువకుడు.
తల్లి కూరగాయల వ్యాపారానికి తోడుగా పనిచేస్తున్న సందీప్.
రీల్స్ చేయాలనే ఆసక్తి ఉన్నా ఫోన్ లేకపోవడం గుర్తించిన అధికారులు.
సందీప్‌కు స్మార్ట్‌ఫోన్ బహూకరించిన సీపీ రమేష్.
పోలీస్ అవగాహన కార్యక్రమాలకు రీల్స్ చేయాలని సూచన.
సైబర్ నేరాలు, డ్రగ్స్,రోడ్డు భద్రతపై కంటెంట్ చేయాలని ఆదేశం.
త్వరలోనే రీల్స్ తయారు చేస్తానని సందీప్ హామీ.
#tvtruenews

7 months ago | [YT] | 1

MANA True News

సీనియర్ సిటిజన్ల కోసం.

గౌరవనీయ ఎంపీ శ్రీ సంజయ్ రౌత్ పార్లమెంట్‌లో ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగానికి మనం అభినందనలు తెలపాలి. ఆయన మాటలు ఇలా ఉన్నాయి:

“65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లను చంపేయండి.
దేశాన్ని నిర్మించిన ఈ ప్రజల వైపు ప్రభుత్వం దృష్టి పెట్టడానికి సిద్ధంగా లేకపోతే, వారిని చంపేయడమే మిగులుతుంది.
భారతదేశంలో సీనియర్ సిటిజన్ కావడం నేరమా?”

భారతదేశంలో 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులో లేదు. EMIలపై లోన్లు ఇవ్వరు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఉద్యోగం ఇవ్వరు. అందువల్ల జీవించడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది.

రిటైర్మెంట్ వయస్సు అయిన 60–65 సంవత్సరాల వరకు వారు పన్నులు చెల్లించారు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టారు. కానీ సీనియర్ సిటిజన్ అయిన తర్వాత కూడా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోంది.
భారతదేశంలో సీనియర్ సిటిజన్ల కోసం సరైన పథకాలు లేవు. రైలు, విమాన ప్రయాణాల్లో 50% రాయితీ కూడా నిలిపివేశారు.

ఇంకో వైపు చూస్తే — రాజకీయాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి, పెన్షన్ కూడా ఉంటుంది. మరి మిగతా సీనియర్ సిటిజన్లకు (కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను తప్ప) ఎందుకు ఇవి దక్కడం లేదు?

సీనియర్ సిటిజన్లను పట్టించుకోకపోతే దేశ భవిష్యత్ ఎలా ఉంటుంది?
ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఫలితాలు తప్పకుండా ప్రభావితమవుతాయి. అప్పుడు ప్రభుత్వం దాని ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వాన్ని మార్చే హక్కు ఉంది. వారిని నిర్లక్ష్యం చేయకండి.
ప్రభుత్వాలను మార్చిన అనుభవం వారికుంది. వారిని బలహీనులుగా భావించవద్దు!

సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ఎన్నో పథకాలు అవసరం. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చాలా డబ్బు ఖర్చు చేస్తోంది కానీ సీనియర్ సిటిజన్లపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.

బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గిపోవడంతో సీనియర్ సిటిజన్ల ఆదాయం తగ్గిపోతోంది. కొంతమందికి వచ్చే స్వల్ప పెన్షన్‌పై కూడా ఆదాయపు పన్ను విధిస్తున్నారు.

కాబట్టి సీనియర్ సిటిజన్లకు ఈ క్రింది ప్రయోజనాలు కల్పించాలి:

1. 60 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పెన్షన్ ఇవ్వాలి

2. వారి స్థితిని బట్టి తగిన పెన్షన్ ఇవ్వాలి

3. రైలు, బస్సు, విమాన ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలి

4. చివరి శ్వాస వరకు అందరికీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి; ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించాలి

5. సీనియర్ సిటిజన్ల కోర్టు కేసులకు ప్రాధాన్యం ఇచ్చి త్వరగా తీర్పు ఇవ్వాలి

6. ప్రతి నగరంలో సీనియర్ సిటిజన్ల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లు ఏర్పాటు చేయాలి

7. 10–15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ చేసే నిబంధనలను సవరించాలి. ఇది వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తింపజేయాలి.
మా వ్యక్తిగత వాహనాలు రుణాలపై కొనుగోలు చేసినవే. 10 సంవత్సరాల్లో కేవలం 40–50 వేల కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయి. అవి కొత్త వాహనాల్లానే ఉంటాయి. అవి స్క్రాప్ చేస్తే కొత్త వాహనం ఇవ్వాలి.

సీనియర్ సిటిజన్లు మరియు యువత అందరూ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయాలని నేను కోరుతున్నాను.
“సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్” అని చెప్పే ఈ ప్రభుత్వం దేశ నిర్మాణానికి తోడ్పడి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికోసం ఏదైనా చేస్తుందనే ఆశిద్దాం.

దయచేసి దీనిని మీ స్నేహితులు, సీనియర్ సిటిజన్లు మరియు శ్రేయోభిలాషులతో పంచుకోండి. హక్కులకై ఉద్యమిద్దాం... ఆరోగ్య, ప్రయోజనాలు పొందుదాం...
సీనియర్ సిటిజన్ల కోసం.

#tvtruenews
#centralgovt

7 months ago | [YT] | 1