Dr Botcha Anusha

"I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go." — Botcha Anusha


Dr Botcha Anusha

రయీంద్రం గ్రామంలో ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి మద్దతు కోరాను.

బొండపల్లి మండలం రయీంద్రం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ZPTC అభ్యర్థిగా నేను, MPTC అభ్యర్థి శ్రీ నవుడు మహేశ్వరరావు గారితో కలిసి పాల్గొన్నాను.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరాను. గ్రామ ప్రజలు, మహిళలు, యువత చూపిన ఆదరణ, మద్దతు ఎంతో సంతోషాన్నిచ్చాయి. ప్రజల నుంచి లభిస్తున్న ఈ అపూర్వ స్పందనతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాం.

ఈ కార్యక్రమంలో చల్లా చలం నాయుడు గారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

#BotchaAnusha #YSRCP #BondaPalli #Gajapathinagaram #LocalBodyElection #TeamBotcha #AndhraPradesh

5 days ago | [YT] | 1,610

Dr Botcha Anusha

రయీంద్రంలో ఉత్సాహంగా సాగిన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

బొండపల్లి మండలం రయీంద్రం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, బొండపల్లి మండల ZPTC అభ్యర్థి డాక్టర్ బొత్స అనూష గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన MPTC అభ్యర్థి శ్రీ నవుడు మహేశ్వరరావు గారితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల నుంచి లభించిన ఆత్మీయ స్వాగతం, మద్దతుతో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో చల్లా చలం నాయుడు గారితో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#BotchaAnusha #Bondapalli #Gajapathinagaram #TeamBotcha #LocalBodyElection #AndhraPradesh

5 days ago | [YT] | 558

Dr Botcha Anusha

గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం, గరుడుబిల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ZPTC అభ్యర్థిగా నేను, MPTC అభ్యర్థి శ్రీ పిల్ల గౌరీ శంకర్ గారు, యువనాయకులు బొత్స సాయి గురునాయుడు గారితో కలిసి గడపగడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నాను. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న తీరును వివరించాను. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారి తరఫున నిరంతరం పోరాడుతానని భరోసా కల్పించాను.

ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆదరాభిమానాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుజి గారు, బొద్దుల చిన్నం నాయుడు గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

#BotchaAnusha #BotchaSaigurunaidu #YSJagan #YSRCP #Bondapalli #Gajapathinagaram #TeamBotcha #LocalBodyElection

1 week ago | [YT] | 2,159

Dr Botcha Anusha

మా ఫ్యామిలీ ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు.. ఉత్తరాంధ్ర అంతా మాదే! | YSRCP | YSJagan | #Bheemili #APPolitics
https://www.youtube.com/watch?v=YQ0p1...

1 week ago | [YT] | 35

Dr Botcha Anusha

గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం, గొల్లుపాలెం గ్రామం, గడప గడపకు ఎన్నికల ప్రచారంలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గేదెల హరి అప్పలనాయుడు గారు ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ ప్రచారంలో మాట్లాడుతూ ఉత్తి ఉత్తి మంత్రి అభివృద్ధి ఏమి చేయలేదు ఇచ్చిన మాట తప్పిన కూటమి పాలన సూపర్ ఫెయిల్యూర్.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల మద్దతుతో ప్రచారం ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమంలో పల్లి రఘు గారు, కిలపతి సుధాకర్ గారు, గోళ్లు సతీష్ గారు, మూకల వెంకట చలం నాయుడు గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

#BotchaAnusha #Bondapalli #ZPTC #LocalBodyElection #AndhraPradesh

1 week ago | [YT] | 968

Dr Botcha Anusha

గజపతినగరం నియోజకవర్గంలో కొత్తవలస గ్రామం బొండపల్లి మండలం ఎన్నికల ప్రచారంలో యువనాయకులు బొత్స సాయి గురునాయుడు గారితో కలిసి పాల్గొన్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి పెద్ద కృష్ణ కొరడ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల మద్దతుతో ప్రచారం ఉత్సాహంగా సాగింది. అలాగే చిన్నతామరపల్లి టీడీపీ శ్రేణులు రెడ్డి సత్యనారాయణ, పిల్ల గురునాయుడు గారి 40 కుటుంబాలు వైసీపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బొద్దుల చిన్నం నాయుడు గారు, మలపర్తి రమణ గారు, మజ్జి ఎంపీటీసీ అభ్యర్థి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

#BotchaAnusha #Bondapalli #YSRCP #YSJagan #LocalBodyElection #AndhraPradesh

1 week ago | [YT] | 1,148

Dr Botcha Anusha

భీమిలి నియోజకవర్గంలో బాలాజీ నగర్, తగరపువలస గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా, 2వ వార్డు వైసీపీ అభ్యర్థి శ్రీ అక్కరమాని రామునాయుడు గారికి అలాగే మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించాను.

ఈ కార్యక్రమంలో భీమిలి జోన్ - 1 పరిశీలకులు వాసుపల్లి జానకిరామ్ గారు, జగ్గుపిళ్లి ప్రసాద గారు, డబ్బేరూ ప్రశాంతి గారు, జీర్ వెంకటరెడ్డి గారు, నమ్మి లక్ష్మణ్ రావు గారు, బింగి హరి కిరణ్ రెడ్డి గారు, పీతల వెంకట అప్పారావు గారు, నమ్మి బంగారు బాబు గారు, మన్యాల పోతయ్య గారు, సారిపల్లి మోహన్ రావు గారు, అక్కరమణి నారాయణ రావు గారు, నమ్మి శ్రీను గారు, నమ్మి రమణ గారు, నమ్మి గోవింద్ గారు, చిల్ల సూర్యనారాయణ గారు, చిప్పాడు వెంకటేష్ గారు, కంచిబోయిన వెంకట్ రావు గారు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#BotchaAnusha #Bheemili #YSRCP #YSJagan #GVMC #LocalBodyElections #visakhapatnam

1 week ago | [YT] | 1,248

Dr Botcha Anusha

గుర్ల మండలంలోని బెల్లానపేట గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి సంగంరెడ్డి వెంకటలక్ష్మి గారు, ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కెల్ల సూర్యనారాయణ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.

ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రజలను కలుసుకుని, వారి ఆదరణను చూసి సంతోషం కలిగింది.

ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గానికి చెందిన శ్రీ కె.వి. సూర్యనారాయణ రాజు గారు, శ్రీ కెల్ల వెంకటరమణ గారు, శ్రీ కొంచాడ ఈశ్వరరావు గారు, శ్రీ కెల్ల జగన్నాథం గారితో పాటు బెల్లానపేట గ్రామ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#BotchaAnusha #SangamureddyVenkatalakshmi #GurlaZPTC #YSRCP #LocalBodyElection #TeamBotcha #AndhraPradesh

1 week ago | [YT] | 1,118

Dr Botcha Anusha

భీమిలి నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, జీవీఎంసీ 5వ వార్డు మంగమారిపేట తీర ప్రాంతంలో మత్స్యకారులను పరామర్శించాను. తుఫాన్ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, బాధిత ప్రజలకు ధైర్యం చెప్పాను.

ఈ కార్యక్రమంలో భీమిలి జోన్-1 పరిశీలకులు శ్రీ జానకిరామ్ గారు, శ్రీ దవులపల్లి కొండబాబు గారు, శ్రీ మెరుగు చిన్నారావు గారు, శ్రీ దూడ అచ్చారావు గారు, రాముళ్ల అప్పడు గారు, శివ గారితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

#BotchaAnusha #Bheемili #YSRCP #Mangamaripeta #CycloneAffectedAreas #Fishermen #Visakhapatnam #TeamBotcha

1 week ago | [YT] | 59

Dr Botcha Anusha

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం భక్తుల జయజయధ్వానాలు, మంగళవాయిద్యాలు, సంప్రదాయ ఆచారాల నడుమ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో సాగింది. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలతో నగరమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. చదురువాడ ఆలయం నుంచి వనం గుడి వరకు అమ్మవారి వైభవం, భక్తుల సందడి, సంప్రదాయాల ప్రత్యేకత సిరిమానోత్సవానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి.

కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అమ్మవారి కరుణాకటాక్షాలతో విజయనగరం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.

#BotchaAnusha #PaidithalliAmmavaru #Sirimanotsavam #Vizianagaram #AndhraPradesh See less

1 week ago | [YT] | 295