AadyaTv is a dynamic YouTube channel covering news from Telangana and Andhra Pradesh. Known for its independent and innovative approach, the channel delivers accurate and factual content, breaking news, political analysis, and satirical pieces with wit & humor.

Aadya TV also provides live reports and in-depth documentaries.

The channel is a one-stop destination for updates on politics, sports, entertainment, business, science, and technology.

Committed to unbiased reporting, Aadya TV aims to be a reliable source for the latest and most comprehensive stories from both Telugu states.
Please Follow On
FB - www.facebook.com/profile.php?id=61556679644352
Twitter - twitter.com/aadya_tv
Instagram - www.instagram.com/aadyatvtelugu/?hl=en




Aadya TV

పేద వైద్య విద్యార్థినికి అండగా రామన్న

వర్ధన్నపేటకు చెందిన పేద విద్యార్థిని కొండేటి అకీరా ఎంబీబీఎస్ చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.

జర్నలిస్ట్ బొల్లెపాక రాజేష్ ట్విట్టర్‌లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ స్పందించి, సోమవారం తెలంగాణ భవన్‌లో అకీరాకు రూ.2 లక్షలు ఇచ్చారు.

అకీరా జాతీయ NEETలో మంచి ర్యాంకు సాధించి పటాన్‌చెరువు మహేశ్వర వైద్య కళాశాలలో ప్రవేశం పొందింది.

కేటీఆర్ చదువు పూర్తయ్యే వరకు కూడా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అకీరా, ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.

#ktr #brsparty #aadyatv

17 minutes ago | [YT] | 29

Aadya TV

నాంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్

లక్ష రూపాయల పెట్టుబడి ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీకి రూ.200 కోట్ల భూములు ఎలా ఇచ్చారు?

నా కేసులో అరెస్ట్ అవసరంలేదు నోటీసులు ఇచ్చి విచారణ చేయమని కోర్టు స్పష్టం చేసింది

నోటీసులు ఇవ్వడానికి 50 మంది వచ్చి తలుపులు బద్దలు కొట్టాల్సిన అవసరం ఏముంది?

అంత దారుణంగా వ్యవహరించినా విచారణకు సహకరించేందుకు ఇక్కడికి వచ్చాను

– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్

#mannekrishank #brsarrest #aadyatv #cmrevanthreddy

20 hours ago | [YT] | 282

Aadya TV

🚨 **పోలీసుల వలయంలో జూరాల ప్రాజెక్టు!**

జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వడం లేదంటూ **ధర్నాకు సిద్ధమైన రైతులు**.

రైతుల ఆందోళన నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వెళ్లే **అన్ని మార్గాల్లో భారీగా పోలీస్ బలగాల మోహరింపు**.

ఎక్కడికక్కడ **బారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధం**.
#juralaproject #revanth #telanganafarmers #farmersprotest #aadyatv

23 hours ago | [YT] | 39

Aadya TV

🚨 **HILTP పేరుతో రూ.10 వేల కోట్ల భూముల గేమ్?**

గోపన్‌పల్లిలోని **అల్యూమినియం ఫ్యాక్టరీకి చెందిన 98 ఎకరాల భూములపై వివాదం** తెరపైకి వచ్చింది.

ఇందులో **53.14 ఎకరాల భూముల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు** ఉంటుందని అంచనాలు.

గతంలో ఈ భూములను **పారిశ్రామిక అవసరాలకే వినియోగించాలనే షరతులు** ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు HILTP ద్వారా వాటిని ఇతర అవసరాలకు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు, ఈ భూముల్లో **రెసిడెన్షియల్, కమర్షియల్ టవర్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం** కూడా వెలువడింది.

👉 ప్రభుత్వ భూములపై నిజంగా ఏం జరుగుతోంది?
HILTP ఎవరికీ లాభం చేకూర్చబోతోంది?
రూ.10 వేల కోట్ల భూములపై ప్రభుత్వం స్పష్టత?
#revanthreddy #landgrabbing #realestatescam #aadyatv

23 hours ago | [YT] | 44

Aadya TV

❌⚡ కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు!

వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం గుమ్మడం సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌ను పరిశీలించి, విద్యుత్ సరఫరాపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న
KTR BRS


లాగ్‌బుక్‌లోని వివరాలతో “6 గంటల కరెంటు కూడా సక్కగా ఇస్తలేరు” అని తేలిపోయింది.

అడ్డగోలు కరెంట్ కోతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారీగా తరలివచ్చిన రైతులు.

#ktr #brsparty #aadyatv #telangananews

2 days ago | [YT] | 603

Aadya TV

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్

కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించిన కేటీఆర్

మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రేవంత్ రెడ్డి చెప్పిన రూ.లక్ష కోట్లు రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో వేస్తాడా?

తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే రేవంత్ రెడ్డి రూ.లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం

లేకపోతే రేవంత్ రెడ్డి పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు

వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ రేవంత్ రెడ్డి ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా?

కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని రేవంత్ రెడ్డే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నాడు

వెయ్యి రోజుల విఫల పాలన నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది

420 హామీల మోసాల నుంచి, 22-A భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగు కోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేరు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ బయటపెడతాం

రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకున్న ప్రతి పైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం

- కేటీఆర్

#ktr #cmrevanthreddy #aadyatv

2 days ago | [YT] | 389

Aadya TV

బిగ్ బ్రేకింగ్ న్యూస్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు

#danamnagender #highcourt #aadyatv

3 days ago | [YT] | 192

Aadya TV

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ తేదీలు ప్రకటన..

వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం సోమల రఘురామ్ రెడ్డితో జరగనుందని ప్రకటించారు.

స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం ఇదని ఆమె పేర్కొన్నారు.ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక జరుగుతాయని షర్మిల వెల్లడించారు. ఇరువురి కలయిక దైవ సంకల్పమని, నూరేళ్ల జీవితానికి శుభారంభమని ఆమె అన్నారు.

కాబోయే నూతన వధూవరుల తొలి వివాహ ఆహ్వాన పత్రికను కుటుంబ సభ్యులు, రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని నాన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు.

నాన్న దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండగా నిలుస్తాయని, ఆయన చూపిన సన్మార్గం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటుందని షర్మిల తెలిపారు.రఘురామ్ రెడ్డి సోమల సుబ్బా రెడ్డి, సోమల పద్మా రెడ్డి దంపతుల కుమారుడు. వీరి కుటుంబం మూలాలు కర్నూలు జిల్లాకు చెందినవి.

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులు. రఘురామ్ రెడ్డి అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్నేహితులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కోరారు. నూతన దంపతుల దాంపత్య జీవితం కన్నుల పండుగగా, సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.

#yssharmila #ysrghat #aadyatv

3 days ago | [YT] | 53

Aadya TV

మీనాక్షి నటరాజన్ పాస్‌పోర్ట్ సీజ్ చేయండి

నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ వేసిన కుంభం శివకుమార్ రెడ్డి కేసు బాధితురాలు శ్రీలత

మీనాక్షి నటరాజన్‌పై ఇప్పటికే కోర్టు పరిధిలో రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆమె ఉన్నత చదువుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని, ఆమె పాస్‌పోర్ట్ జప్తు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన శ్రీలత

క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్తే న్యాయ ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని, ఆమె విదేశీ పర్యటనను అడ్డుకోవాలని పిటిషన్

#meenakshinatarajan #congressparty #aadyatv

3 days ago | [YT] | 38

Aadya TV

ఫార్ములా-ఈ రేసు అక్రమ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!

#ktr #nampallycourt #aadyatv

4 days ago | [YT] | 433