సనాతన ధర్మాన్ని కాపాడుతూ..హిందూబంధువులకు అండగా...ధర్మపరిరక్షుకులు బ్రాహ్మణులకు బ్రహ్మాస్త్రంగా ఆరంభమైన ab6news చానల్ ను Subscribe చేసుకుని ప్రోత్సహించండి...

Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)

ఛానల్ కు ఆర్థిక చేయూతను అందించేందుకు 9052116462 నంబర్ కు Google Pay | Paytm | PhonePay ద్వారా సహకారం అందిస్తూ ధర్మ పరిరక్షణలో మీరు భాగస్వాములు కండి...




ab6 news

ప్రముఖ చారిత్రక నవలా రచయిత ఆచార్య ముదిగొండ శివప్రసాద్ అస్తమయం 🙏

జ్యేష్ఠ కార్యకర్త, ప్రముఖ నవలా రచయిత ఆచార్య ముదిగొండ శివప్రసాద్ (86) గురువారం రాత్రి 8:45 నిమిషాలకు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాశ విడిచారు. వీరు ‘‘చారిత్రక నవలా చక్రవర్తి’’గా ప్రసిద్ధులయ్యారు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా ఆకులల్లూరు. వీరి తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, మల్లికార్జున రావు.
ఎం.వి.ఎస్.శర్మ, రామనాథశాస్త్రి, మార్కాండేయశర్మ వద్ద విద్యాభ్యాసం చేశారు. అలాగే ఎం.ఎ., పి.హెచ్.డి. చేశారు.శివ ప్రసాద్ దాదాపుగా 83 పుస్తకాలు రాస్తే, అందులో 20 చారిత్రక నవలలే. వీరు కొంత కాలం సికింద్రాబాద్ లోని వెస్లీ హైస్కూలులో ఉపాధ్యాయులుగా చేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు.వీరికి చాలా మంది శిష్యులు కూడా వున్నారు.
అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో కూడా వీరు పనిచేశారు. తెలుగు శాఖలో పనిచేసినా, రాష్ట్ర, దేశ రాజకీయాలపై విపరీతమైన పట్టు వుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై, క్రైస్తవంపై విపరీతమైన పట్టు వుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా చేశారు.
శ్రీపదార్చన
ఆవాహన
పట్టాభి
రెసిడెన్సీ
శ్రీలేఖ
శ్రావణి
వంశధార
తంజావూరు విజయం
మహాసర్గ
బసవగీత
సమ్రాట్ పుష్యమిత్ర
సగం విరిగిన చంద్రుడు
వీరి ప్రసిద్ధమైన నవలలు ఇవే. అలాగే వీరి నవలల పేర్లు కూడా కొందరు తమ కూతుళ్లకు పెట్టుకున్నారు కూడా. అలాగే తెలుగు సాహిత్యంలో సంప్రదాయ, ఆధునిక సాహిత్య ప్రక్రియలపై విపరీతమైన పట్టు వుంది. అంతేకాకుండా శ్రీలేఖ, శ్రావణి అనే రెండు నవలలు వీరికి ఎంతగానో ప్రజాదరణ తెచ్చిపెట్టాయి.
అలాగే క్రైస్తవాన్ని, అక్రమ మత మార్పిళ్లను ప్రశ్నిస్తూ.. అనేక ఉపన్యాసాలు, వ్యాసాలు కూడా రాశారు. అలాగే వామపక్షాల కుట్రల కారణంగా మన విద్యా వ్యవస్థలో జరిగిన నష్టాలతో పాటు మరికొన్ని విషయాలపై అత్యంత సాధికారతతో మాట్లాడేవారు, రాసేవారు. ముదిగొండ శివప్రసాద్ మరణం జాతీయవాదానికి తీరని లోటు.
అలాగే క్రైస్తవాన్ని, అక్రమ మత మార్పిళ్లను ప్రశ్నిస్తూ.. అనేక ఉపన్యాసాలు, వ్యాసాలు కూడా రాశారు. అలాగే వామపక్షాల కుట్రల కారణంగా మన విద్యా వ్యవస్థలో జరిగిన నష్టాలతో పాటు, చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం... ఇలా మరికొన్ని విషయాలపై అత్యంత సాధికారతతో మాట్లాడేవారు, రాసేవారు. ముదిగొండ శివప్రసాద్ మరణం జాతీయవాదానికి తీరని లోటు.

1 week ago (edited) | [YT] | 485

ab6 news

సింగీతం శ్రీనివాస రావు ఇక లేరు

చివరి చిత్రం సింగ్ గీతం

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. గత కొద్ది రోజులుగా వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న సింగీతం శ్రీనివాస్ రావు (94) చెన్నైలో కావేరి హాస్పిటల్లో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం 'సింగ్ గీతం'. ఇటీవలే విడుదలైన ఈ సినిమాను కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసి ఎక్కువ సక్సెస్ లు ఇచ్చిన దర్శకుడిగా సింగీతం శ్రీనివాస రావు పేరు ప్రతిష్టలు గడించారు.
సింగీతం శ్రీనివాస్ రావు 21 సెప్టెంబర్ 1931లో ఉదయగిరి, నెల్లూరు జిల్లాలో జన్మించారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. 1960లో లక్ష్మీకల్యాణిని సింగీతం శ్రీనివాసరావు వివాహం చేసుకున్నాడు. స్క్రిప్ట్ ర‌చ‌న‌లో తోడ్పడుతూ ఆయనకు సినీ కెరీర్‌లో ల‌క్ష్మీ క‌ల్యాణి కీలక పాత్ర పోషించింది. సింగీతం శ్రీనివాసరావు త‌న స‌తీమ‌ణి పేరుపై ‘శ్రీకల్యాణీయం’ అనే ఓ పుస్తకాన్ని 2012లో రాశాడు. కొంత కాలం అనారోగ్యంతో బాధ‌ప‌డిన లక్ష్మీ కల్యాణి 2022 మే 28న తుది శ్వాస విడిచింది

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైన , ప్రయోగాత్మకమైన, కథాభరితమైన ఇలా వైవిధ్యం గల సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు.
సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్లల కోసం హిందూ 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతం సమకూర్చాడు.
సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర ఆయన అనుచరునిగా పని చేశారు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డికి అసిస్టెంట్ గా పనిచేశాడు. పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీసినప్పుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు.
సంగీతం మరణం పట్ల తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సింగీతం శ్రీనివాసరావు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. ‪@ab6news‬ అక్షర నివాళి

2 weeks ago | [YT] | 83

ab6 news

దక్షిణ భారతావనిలోని తెలుగు బ్రాహ్మణుల మధ్య పెరుగుతున్న సత్ సంబంధాలు..
Watch ab6News.. Pls Subscribe & Share and Support.

2 weeks ago (edited) | [YT] | 241

ab6 news

సీఎం రేవంత్ పిలుపు.. వరంగల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టండి...
బ్రాహ్మణులారా.. వరంగల్ ఎయిర్ పోర్ట్ కు
"పీవీ నరసింహారావు ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ " గా పేరు పెట్టాలని cm Revanth reddy 'x' account కి మెస్సేజ్ పంపండి...

1 month ago | [YT] | 44

ab6 news

*_విఘ్నాలను తొలగించి, విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీకు,మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ🙏_*

*వినాయక చవితి శుభాకాంక్షలు..💐🙏🏻
మీ...
విష్ణుదాస్ శ్రీకాంత్
ఫౌండర్ & సీఈఓ
ab6news *

youtube.com/@ab6news

1 month ago | [YT] | 15

ab6 news

గుడి లేదు..గోపురం లేదు.. తెలుగు రాష్ట్రాల మధ్యలో అతి పెద్ద మహాగణపతి..
watch : https://youtu.be/g5_i6ISDv5E

1 month ago | [YT] | 161

ab6 news

Congratulations Madam 💐

ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా తొలి సారి ప్రభుత్వం సగౌరవంగా ఇస్తున్న ఎక్సలెన్స్ అవార్డును అందుకుంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన గారికి శుభాకాంక్షలు 💐

1 month ago | [YT] | 80