BHAKTHI TV is a 24x7 satellite devotional channel in Telugu which caters to everyone following Hinduism and interested in Spirituality. It was launched on August 30, 2007. It is also one of the NTV (24x7 News) Product. It's South India's first Telugu devotional channel comprising Daily devotional news, Horoscope, Poojas, Stotra Parayanas and many other Special devotional programs relating to major Hindu festivals


Bhakthi TV

ధన త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి? | Dhana Trayodashi 2026 | Dharma Sandehalu by Brahmasri Kakunuri Suryanarayana Murthy | Bhakthi TV
#DhanaTrayodashi #DharmaSandehalu

5 hours ago | [YT] | 0

Bhakthi TV

భక్తిటీవీ కోటి దీపోత్సవం- 2026🙏🕉️

8 Days To Go!

🪔 Pravachanam by Brahmasri Dr Mylavarapu Srinivasa Rao 🙏

BhakthiTV Koti Deepotsavam- 2026
🗓️November 14th To 30th
📍NTR Stadium, Hyderabad
🕠 5:30 PM onwards

#BhakthiTV #KotiDeepotsavam #KotiDeepotsavam2026 #KarthikaMasam #MylavarapuSrinivasaRao

5 hours ago | [YT] | 69

Bhakthi TV

కార్తికమాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవచ్చా? | Karthika masam 2026 gruhapravesam muhurtham dates | Can We Perform Weddings & Gruhapravesam During Karthika Masam? | Hindu Traditions | Bhakthi TV

#KarthikaMasam #WeddingCeremony #Gruhapravesam #HinduTraditions #BhakthiTV

7 hours ago | [YT] | 1

Bhakthi TV

భక్తి విశేషాలు | Bhakthi Visheshalu | 05th November 2026 | Devotional News Updates | Bhakthi TV

#bhakthitv #bhakthinews #bhakthisamacharam #bhakthiviseshalu

10 hours ago | [YT] | 1

Bhakthi TV

6th November 2026
ప్రదోష వ్రతం (శివవూజ) :
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అంటారు. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.

18 hours ago | [YT] | 1,315

Bhakthi TV

6th November 2026
ధన్వంతరీ జయంతి :
క్షీరసాగరమధనం సమయంలో సాగరగర్భం నుండి విష్ణు అంశతో యువకునిగా ధన్వంతరి ఉదయించాడు. లేలేత బాహు దండాలు, విశాలమైన వక్షస్థలి కలిగివున్నాడు. పద్మాలవలె ఎర్రనైన కన్నులతోనూ చిక్కనైన కేశజాలంతోనూ, నీలగాత్ర తేజంతోనూ కనిపించాడు. పీతాంబరాలలను కట్టుకున్నాడు. మణికుండలాలతోనూ పుష్పమాలాతోనూ సమలంకృతుడై ఉన్నాడు. అమృత కలశాన్ని ఒక చేత్తోనూ వనమూలికల్ని మరొక చేత్తోనూ పుచ్చుకుని ఆవిర్భవించాడు. ముక్కోటి దేవతలూ ఆ రూపాన్ని రెప్పవాల్చకుండా చూశారు. "ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశహస్తాయా ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్..." అని ధన్వంతరీ గాయత్రి జపించారు. శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించే వాడు ధన్వంతరి. సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది. భాగవత పురాణం ధన్వంతరిని విష్ణుమూర్తి 12వ అవతారం అని పేర్కొంది. పురాణ కథనాలు అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే... ఇది శ్రీ ధన్వంతరి ధ్యానమంత్రం. ఋగ్వేదంలో దేవభిషక్కులుగా అశ్వనీదేవతలే ప్రసిద్ధులు. పురాణకాలంలో ధన్వంతరి ఆవిర్భవించాడు. వ్యాసభారతం ఉద్యోగపర్వంలోనూ, భాగవంతం నవమ స్కంధంలోనూ, హరివంశం 29వ అధ్యాయంలోనూ ధన్వంతరిని గురించిన ప్రస్తావనలున్నాయి. ఇంకా అగ్నిపురాణం, గరుడపురాణాలలో కూడా ఉంది. ధన్వంంతరి చారిత్రక వ్యక్తిగా భారతదేశంలో నడయాడాడని, ఆయనే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించాడని నమ్మేవారున్నారు.

18 hours ago | [YT] | 802

Bhakthi TV

Daily Horoscope | Rasi Phalalu | Subhadinam | Dr. Edupuganti Padmaja Rani | 06-11-2026 | VanithaTv Live

#dailyhoroscope #rasiphalalu #rashiphalalu #edupugantipadmajarani
https://youtu.be/C3LSUsDW9EM

18 hours ago | [YT] | 3

Bhakthi TV

6th November 2026
గురుద్వాదశి (శ్రీపాదశ్రీవల్లభ ఆరాధన) :
ఈరోజు గురు ద్వాదశి శ్రీ పాద శ్రీవల్లభ స్వామి అవతార సమాప్తి సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేయండి. శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందండి. పరమపవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే అనఘాష్టమీ వ్రతం చేసి వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేస్తూ, కష్టార్జితంతో వేయిమంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. దీని పఠనం వల్ల సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఇది చదివినట్లయితే శ్రీపాదుల అనుగ్రహం లభిస్తుంది. ఇది చదివే చోట సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగు తుంటారు," అని ఈ మంగళస్తోత్ర మహిమను వివరించారు.

18 hours ago | [YT] | 243

Bhakthi TV

6th November 2026
ధనత్రయోదశి :
దీపావళిలోని అయిదురోజుల పండుగను కలిపి పంచపర్వాలంటారు. ఈ అయిదు రోజులూ లక్ష్మీపూజ చేస్తారు. దీపావళికి ముందువచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఉత్తరాదివారు ధన్ తేరస్ అంటారు. మానవుని సుఖ జీవనానికి ధనం ప్రధాన సాధనం. ఆ ధనార్జన ధర్మమార్గంలో ఉన్నప్పుడే సమాజానికి క్షేమం కలుగుతుంది. ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం ఓ అలవాటుగా పెట్టుకుంటే ధనార్జన కూడా పవిత్ర మార్గంలో చేయడం సాధ్యమవుతుంది. చతుర్వర్గ చింతామణి అనే ధర్మగ్రంథంలో ఈ ధనద త్రయోదశి పర్వ విశిష్టతలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

ధన త్రయోదశి రోజున లక్ష్మీపూజతో పాటు గోత్రిరాత్ర వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాలవారు దీపావళి నాటికి గత సంవత్సరానికి సంబంధించిన లెక్కలన్నీ సరిచూసుకుని దీపావళినాడు కొత్తగా లెక్కల పద్దు ప్రారంభిస్తారు. ఈ పండుగరోజున ఇళ్లను సుందరంగా అలంకరిస్తారు. రంగురంగు ముగ్గులు చిత్రించి లక్ష్మీ దేవికి స్వాగతం చెబుతారు. తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను, వెండి వస్తువులను పాలతో శుభ్రం చేసి వాటిని పూజలో ఉంచుతారు.

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాది గవేరథమ్
ప్రజానాం భవసిమాతా ఆయుష్మంతం కరోతుమాం

పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు సకలం ప్రసాదించు. జనులకు నీవు తల్లిగా భాసిస్తున్నావు అని ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని ప్రార్ధించాలి.

19 hours ago | [YT] | 187

Bhakthi TV

అమెరికాలో తెలుగు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా పడి పూజ! | Ayyappa Padi Pooja At America | Bhakthi Tv

#AyyappaSwamy #AyyappaPadiPooja #USA #TeluguDevotees #BhakthiTV

1 day ago | [YT] | 3