Mana Paleru News | Telangana Politics & Local Updates
Mana Paleru News brings you the latest news, political updates, Paleru constituency developments, Telangana state politics, and local issues with truth and clarity. Stay updated with breaking news, live coverage, and analysis on leaders, elections, and public voices.
👉 Subscribe for Paleru politics, Telangana updates, Revanth Reddy, Congress and more!
Mana Paleru News
భక్తిశ్రద్ధలతో.. రేజర్లలో శివాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం
దుర్గా నాగమల్లేశ్వర స్వామికి మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ దుర్గా నాగమల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన శివాద్రి గిరి ప్రదక్షిణకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. దేవస్థానానికి చేరుకున్న మంత్రికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా శివాద్రి గిరి ప్రదక్షిణను పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి భక్తులు, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి వేళ దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణతో భక్తులు భక్తిభావంలో మునిగిపోయారు.
#SriDurgaNagaMalleswaraSwamyTemple #GiriPradakshina #Rejerla #Sathupally #Khammam #Telangana
9 hours ago | [YT] | 33
View 1 reply
Mana Paleru News
దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..
నారాయణపురంలో పండుగ సందడి
పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు
దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం స్థానిక దేవాలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచె, లాల్చీ ధరించి, అంచులున్న కండువాను మెడలో వేసుకుని పూజల్లో పాల్గొన్న మంత్రి.. పండుగ వేళ స్వగ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.
గ్రామస్తులతో ఆత్మీయ పలకరింపులు..:
మంత్రి స్వగ్రామానికి చేరుకోవడంతో నారాయణపురంలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించిన పొంగులేటి.. ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ తమ మధ్యకు వచ్చిన మంత్రిని కలుసుకోవడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.
#Kalluru #Khammam #Telangana
9 hours ago | [YT] | 26
View 0 replies
Mana Paleru News
8 Days to go ✨
#AdvanceHBDPSR
#hbdponguletisrinivasareddy
17 hours ago | [YT] | 27
View 2 replies
Mana Paleru News
💠 పారదర్శక రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు
💠 భూభారతితో ఏళ్లనాటి భూ సమస్యలకు పరిష్కారం
💠 34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కుల జారీ
ప్రజలకు మెరుగైన, పారదర్శక రెవెన్యూ సేవలు, రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. గత ప్రభుత్వంలోని పెద్దల నిర్లక్ష్యం, నిర్వాకం, స్వార్ధపూరిత నిర్ణయాల వల్ల పదేళ్లలో రెవెన్యూ వ్యవస్ధ పూర్తిగా అస్థవ్యస్తమైందని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.
సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరును సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాగా పనిచేయాలని ఆదేశించారు.
ప్రజలు కోరిన భూవివాదాలు లేని తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 5,68,858 పాస్ బుక్కులు జారీ చేశామని అలాగే ఈ చట్టానికి ముందు 6,71,508 మొత్తం ఈ 34 నెలల్లో 12,40,366 పాస్ బుక్ లను రైతులకు అందజేయడం జరిగిందని చెప్పారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామన్నారు. కొన్ని దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో హక్కులు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాలకు దూరమై ఇబ్బందులు పడుతున్న రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలిచి సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి చట్టబద్దమైన హక్కులు కల్పిస్తున్నామన్నారు.
ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే నిర్వహించి గిరిజనులు, గిరిజనేతరుల సమస్యను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకుపైగా హక్కులు కల్పిస్తున్నామన్నారు.
#bhubharati
1 day ago | [YT] | 27
View 0 replies
Mana Paleru News
9 Days to go ✨
#AdvanceHBDPSR
#hbdponguletisrinivasareddy
1 day ago | [YT] | 55
View 2 replies
Mana Paleru News
10 Days to go ✨
#AdvanceHBDPSR
#hbdponguletisrinivasareddy
2 days ago | [YT] | 66
View 2 replies
Mana Paleru News
బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆడబిడ్డలు ఘనంగా జరుపుకోవాలని, ఆ గౌరమ్మ తల్లి దీవెనలతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ..
తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐
#SaddulaBathukamma #HappyBathukamma
2 days ago | [YT] | 59
View 1 reply
Mana Paleru News
11 Days to go ✨
#AdvanceHBDPSR
#hbdponguletisrinivasareddy
3 days ago | [YT] | 66
View 0 replies
Mana Paleru News
తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు 🙏
#SoyaBullaKhanJayanti
3 days ago (edited) | [YT] | 12
View 0 replies
Mana Paleru News
ఉత్తర తెలంగాణ జిల్లాల ఆరోగ్య సంజీవిని వరంగల్ నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
#WarangalMGMHospital #WarangalHospital #SuperSpecialityHospital #Warangal #Telangana
4 days ago | [YT] | 48
View 0 replies
Load more