Social Audit Andhra Pradesh

This YouTube channel is managed under the supervision of the State Office of Social Audit Andhra Pradesh. While there are 26 district-level channels, this is the primary channel representing the state.

The channel streams live Gram Sabha-based public hearings and awareness programs related to the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS).

As per Section 17 of the MGNREGA Act, 2005, Social Audits Are Conducted at The Gram Panchayat level. SSAAT is an Autonomous Organization Established in 2009 and Functions Under The Department of Rural Development.

Live Streaming is Coordinated From The State Office By SRPs at the Field level,
Under The Supervision of DRP/Social Media Content In-Charge.

- Director of SSAAT: **Sri G.Srikanth** Garu


Social Audit Andhra Pradesh

*పారదర్శక పాలనలో ఏపీ చరిత్ర*

*జాతీయ స్థాయిలో సోషల్ ఆడిట్ సొసైటీకి ‘SKOCH’ Gold పురస్కారం*

*దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్ర సోషల్ ఆడిట్ సంస్థగా రికార్డు*

*డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో అరుదైన మైలురాయి*

పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలనా సంస్కరణలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ (SSAAT) ప్రతిష్ఠాత్మక SKOCH అవార్డును అందుకుని ప్రత్యేక ఘనత సాధించింది.

దేశంలోనే ఈ పురస్కారం అందుకున్న తొలి రాష్ట్ర సోషల్ ఆడిట్ సంస్థగా ఆంధ్రప్రదేశ్ SSAAT రికార్డు నెలకొల్పింది. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగిన 109వ SKOCH సమ్మిట్‌లో ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ G. శ్రీకాంత్ ఈ SKOCH Gold పురస్కారాన్ని అందుకున్నారు. SKOCH అధికారిక రికార్డుల్లోనూ SSAAT ప్రాజెక్ట్ సామాజిక తనిఖీ, పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించిన ప్రాజెక్ట్‌గా నమోదైంది. (SKOCH Exhibition⁠)

*పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో కీలక ముందడుగు*

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ అందిస్తున్న మార్గదర్శకత్వం సోషల్ ఆడిట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత ఉండేలా చూడటం, ప్రజలే పనులను పరిశీలించి తమ అభిప్రాయాలను వెల్లడించేలా సామాజిక తనిఖీలను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో చేపట్టిన చర్యలు SSAAT పనితీరుకు మరింత బలం చేకూర్చాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సుపరిపాలనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ జాతీయ గుర్తింపు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

*దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఏపీ సోషల్ ఆడిట్ విధానం*

గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సామాజిక తనిఖీలు నిర్వహించడం, గ్రామ సభలు, ప్రజా వేదికల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఆడిట్ ఫలితాలను ప్రజల ముందుంచడం, నివేదికలను డిజిటలైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావడం వంటి విధానాలను SSAAT అమలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సోషల్ ఆడిట్ విధానాలను అధ్యయనం చేసేందుకు 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందాలు గుంటూరు, కర్నూలు జిల్లాలతో పాటు ఎమ్మిగనూరులో పర్యటించాయి. క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, ఫిర్యాదుల నమోదు, నివేదికల ప్రక్రియను పరిశీలించిన అధికారులు తమ రాష్ట్రాల్లో అనుసరించదగిన అంశాలను అధ్యయనం చేశారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందాలకు SSAAT ఆధ్వర్యంలో శిక్షణ అందించడం ద్వారా సామాజిక తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని విస్తృతంగా పంచుకుంది.

*లక్షలాది పనులపై సామాజిక తనిఖీలు*

రాష్ట్రంలో ఏటా 13,396 సామాజిక తనిఖీలను నిర్వహిస్తూ SSAAT విస్తృత స్థాయిలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో 8.9 లక్షల పనులపై, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.18 లక్షల పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించింది. అంతేకాకుండా 43.4 లక్షల ఉపాధి శ్రామిక కుటుంబాలను నేరుగా వారి ఇళ్ల వద్దనే సంప్రదించి వారి సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నమోదు చేసింది.

ప్రజల నుంచి నేరుగా సమాచారాన్ని సేకరించడం ద్వారా క్షేత్రస్థాయిలో పథకాల అమలును పరిశీలించడంతో పాటు, గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం సుగమం చేస్తోంది.

*“సిబ్బంది కృషికి దక్కిన గౌరవం”*

ఈ సందర్భంగా ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీ G. శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీ పాలన అందించేందుకు SSAAT చేస్తున్న కృషికి SKOCH అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమన్నారు.

“ఈ పురస్కారం సంస్థకు మాత్రమే కాదు.. సోషల్ ఆడిట్ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి కృషికి దక్కిన గౌరవం. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనను మరింత బలోపేతం చేసేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తాం” అని శ్రీకాంత్ తెలిపారు.

*ప్రజల భాగస్వామ్యాన్ని పాలనలో అంతర్భాగంగా మార్చి, సామాజిక తనిఖీలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సోషల్ ఆడిట్ సొసైటీకి లభించిన SKOCH Gold పురస్కారం రాష్ట్ర సామాజిక తనిఖీ వ్యవస్థకు జాతీయ స్థాయిలో లభించిన కీలక గుర్తింపుగా నిలిచింది.*

1 month ago | [YT] | 47

Social Audit Andhra Pradesh

VB-G RAM G Song

1 month ago | [YT] | 3

Social Audit Andhra Pradesh

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన (SSAAT AP)కు ప్రతిష్ఠాత్మక *SKOCH* అవార్డు లభించిన సందర్భంగా, శ్రీ జి. శ్రీకాంత్, డైరెక్టర్ SSAAT-AP గారిని గౌ|| శ్రీ వి.ఆర్. కృష్ణ తేజ మైలవరపు, I.A.S, కమిషనర్ గారు సత్కరించి, అవార్డు సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

1 month ago | [YT] | 55

Social Audit Andhra Pradesh

*ఏపీ సోషల్ ఆడిట్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు — చారిత్రక ఘనత:*

*సామాజిక తనిఖీ, జవాబుదారీతనం మరియు పారదర్శకత సంస్థ (AP SSAAT)* ప్రతిష్టాత్మక *స్కోచ్ అవార్డు–2026* కు ఎంపిక కావడం ఎనలేని ఆనందాన్నిస్తోంది. దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్ర *సోషల్ ఆడిట్ సంస్థ* ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం, అదీ *ఆంధ్రప్రదేశ్‌* కు దక్కడం ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. గ్రామ స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం పాటిస్తున్న జవాబుదారీతనంతో కూడిన పారదర్శకతకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది.

పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం *సోషల్ ఆడిట్* వ్యవస్థలో కీలక సంస్కరణలు అమలు చేసింది. గ్రామ సభలు, ప్రజా వేదికల ప్రత్యక్ష ప్రసారం, సామాజిక తనిఖీ నివేదికల డిజిటలైజేషన్‌తో వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం, గ్రామీణ యువతను ఈ ప్రక్రియలో భాగస్వాముల్ని చేయడం వంటి చర్యలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాయి. రాష్ట్రంలో ఏటా *13,396* సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించి *100 శాతం* రికార్డు సాధించాం.

*ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ* ల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు దేశంలోని 22 రాష్ట్రాల ప్రతినిధులు గుంటూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించడం మన *సోషల్ ఆడిట్ వ్యవస్థ* కు లభించిన మరో గొప్ప గుర్తింపు. *2024–25* ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల పనులపై, *2025–26* ఆర్థిక సంవత్సరంలో 9.18 లక్షల పనులపై సోషల్ ఆడిట్లు నిర్వహించాం. 43.4 లక్షల మంది ఉపాధి శ్రామికుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి, వారి సమస్యలు, సూచనలతో పాటు ఫిర్యాదులను కూడా నమోదు చేశాం. గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న *సోషల్ ఆడిట్* సిబ్బంది ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఉపాధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు.

అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం సంతృప్తినిస్తోంది. ఈ అవార్డు, *సామాజిక తనిఖీ జవాబుదారీతనం మరియు పారదర్శకతకు నిదర్శనం* . దేశంలోనే ఈ ఘనత సాధించిన *మొట్టమొదటి రాష్ట్ర సోషల్ ఆడిట్ శాఖగా ఆంధ్రప్రదేశ్* చరిత్ర సృష్టించింది.

ఇట్లు
*సోషల్ ఆడిట్, ఆంధ్రప్రదేశ్*

1 month ago | [YT] | 63

Social Audit Andhra Pradesh

VB G RAM G Scheme- Social Audit Andhra Pradesh.

https://youtu.be/cZ05_kd4MGc?si=6D6p9...

2 months ago | [YT] | 1

Social Audit Andhra Pradesh

Social Audit Andhra Pradesh Theme Song..

https://youtu.be/bmBQsaNoS3I?si=SRRNF...

2 months ago | [YT] | 2

Social Audit Andhra Pradesh

కందకాలు త్రోవ్వకాలను ప్రోత్సహిద్దాం - భూసారాన్ని పెంచుదాం
-సామాజిక తనిఖి సంస్థ

2 months ago | [YT] | 12