Welcome To VOICE Of SAINTS. An ultimate channel to know in depth of about Life of Saints, how they lived, works of saints and how they termed as saints.
Story Of Each Saints is will be very interesting and many hidden things most of them not aware of it.
Saints are persons believed to be connected in a special manner with what is viewed as sacred reality—gods, spiritual powers, mythical realms, and other aspects of the sacred or holy.
We are looking forward for your support in reviewing our videos, sharing videos.
We appreciate for your Subscribe to our Channel of Voice Of Saints.
Follow Us On : www.facebook.com/VoiceOfSaints/
Thank you,
GOD BLESS YOU ALL
VOICE OF SAINTS తెలుగు
October 6 ♥️♥️జపమాల మాత కు అంకితం చేయబడిన నెలలో 6వ రోజు📿📿📿
ప్రార్ధన : 😍😍 ఓ మరియమ్మ! పరిపూర్ణ సౌందర్యవతీ, నన్ను దేవునికి ప్రియమగునట్లు చేయుము.
జన్మ పాపము లేనివారా, నన్ను పాపము నుండి కాపాడండి.
మోక్షము యొక్క మహిమా, నన్ను పరలోకమున జేర సహాయము చేయండి.
కష్టపడు వారికి సంతోషము నొసంగువారా, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి.
ఆమెన్.♥️♥️
ఈరోజు పునీత బ్రూనో గారి పండుగ 💐 💐
వీరు క్రీస్తుశకం 1030 - 1101 మధ్యకాలంలో జీవించిన జర్మనీ దేశపు గురువు, 👹👹 దయ్యము పట్టిన వారికి పాలక పునీతుడు మరియు మత సాక్షి 💫 💫
బంగారు మాట 🌟 దేవుని కోసం మనం చేసే పోరాటంలో మనం ఈ ప్రపంచానికి తెలియని శాంతిని అనుభవించగలం 😇😇
St.Bruno గారా దుష్ట ఆత్మలుచే పీడింప బడుతున్న వారి కొరకు ప్రార్థించండి 🙏 🙏
పరిశుద్ధ మరియమ్మ గారా ! ఎవరికీ చెప్పుకోలేని బాధలతో సతమతమవుతున్న వారికి మీ సహాయాన్ని అందించి వారికి తోడుగా ఉండండి ♥️ ♥️
పునీత అంతోని వారికి సంబంధించిన వీడియో మన చానల్లో ఉంది దయచేసి ఒకసారి చూడండి 🥹 🥹
St. Anthony Of Padua Pray for Us 🙏 🙏
19 hours ago | [YT] | 389
View 20 replies
VOICE OF SAINTS తెలుగు
October 5. జపమాల మాత కు అంకితం చేయబడిన నెలలో 5వ రోజు 📿📿
ప్రార్థన ♥️ : ఓ దయగల మాతా! మిమ్ము కొనియాడు ఈ సమయమున మీ వేడుదలయందు మాకుగల నమ్మకమును దృఢపరచి మేము శోధనలకు లోబడకుండ మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఓ దివ్య జననీ! దైవాజ్ఞలను పాటించు స్థిరమైన మనస్సును, పూర్ణమనస్తాపమును, ఎల్లప్పుడు శోధనలను జయించు వరమును, దేవ ఇష్ట ప్రసాదములో మరణించు అనుగ్రహమును మాకు దయచేయండి. మేము కలకాలము మీతో మోక్షానందము పొందుటకు మిమ్ము దీన భావముతో వేడుచున్నాము తల్లి. ఆమేన్ ♥️♥️
ఈ రోజు పునీత. రెమిజియసు గారి పండుగ 💐 💐
వీరు క్రీస్తు శకం 437 - 530 మధ్య కాలంలో జీవించిన ఫ్రాన్స్ పీఠాధిపతి మరియు వేద సాక్షి 💫 💫
బంగారు మాట 🌟 శరీరమైన కోరికలు అను పొలములో ఒకడు విత్తనములు చల్లినచొ, శరీరము నుండి అతనికి లభించు ఫల సాయము క్షయమైనవి. ఆత్మ అను పొలంలో అతడు విత్తనములు నాటినచో, ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమును ఫలసాయమును పొందును ( గలతీ 6 : 8 )
పునీత. రెమిజియసు గారా మీరు దేవునికి విధించినట్లే మా యువతి యువకులు కూడా దేవునికి విధేయులుగా జీవించేలా ప్రార్థించండి ♥️♥️
పరిశుద్ధ మరియమ్మ గారా యువతీ యువకుల కొరకు ప్రార్థించండి 🙏 🙏
1 day ago | [YT] | 673
View 5 replies
VOICE OF SAINTS తెలుగు
October 4. జపమాల మాతకు అంకితం చేయబడిన నెలలో 4వ రోజు📿📿📿📿
ప్రార్థన : ♥️♥️ కృపతో నిండిన మాతా! నమస్కారము. ప్రభువు నీతో ఉన్నారు. స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలమైన యేసు కూడా ధన్యుడే.
పరిశుద్ధురాలైన మరియా, దేవుని తల్లి పాపాత్ముల మై ఉండడే మా కొరకు, ఇప్పుడు మా మరణ సమయములోను ప్రార్థించండి. ఆమేన్."🙏🙏
ఈ రోజు పునీత. ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి గారి పండుగ 💐 వీరు క్రీస్తుశకం 1182 - 1226 మధ్య కాలంలో జీవించిన ఫ్రాన్సిస్ సభ వ్యవస్థాపకుడు , మరియు ప్రపంచంలో పంచ గాయాలు పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి , ప్రకృతి ప్రేమికుడు ఇటలీ దేశ మరియు కతోలిక క్రియల పాలక పునీతుడు 💫 💫 💫
పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి గారి పూర్తి జీవిత చరిత్ర👇👇👇👇
https://youtu.be/5D_Ef8zEqC4?si=NPYd6...
పంచ గాయాల చరిత్ర 👇👇
youtube.com/shorts/Kr0vjfLCyV...
పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి గారి ప్రార్థన ✝️ ♥️😍
ప్రభువా, నన్ను నీ శాంతికి సాధనంగా చేయుము:
• ద్వేషం ఉన్న చోట, నేను ప్రేమను తీసుకు వచ్చేటట్లు చెయ్యండి.
• అవమానం ఉన్న చోట, నేను క్షమాపణను తీసుకు వచ్చేటట్లు చేయండి.
• విభేదం ఉన్న చోట, నేను ఐక్యతను తీసుకు వచ్చేటట్లు చేయండి
• సందేహం ఉన్న చోట, నేను విశ్వాసాన్ని తీసుకు వచ్చేటట్లు చేయండి
• తప్పు ఉన్న చోట, నేను సత్యాన్ని తీసుకు వచ్చేటట్లు చేయండి.
• నిరాశ ఉన్న చోట, నేను ఆశను తీసుకు వచ్చేటట్లు చేయండి.
• చీకటి ఉన్న చోట, వెలుగును తీసుకుని వచ్చేటట్లు చేయండి.
• విచారం ఉన్న చోట, ఆనందాన్ని తీసుకు వచ్చేటట్లు చేయండి.
St.Francis Of Assisi గారా మా కొరకు ప్రార్థించండి 🙏
పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి 🙏
2 days ago | [YT] | 460
View 4 replies
VOICE OF SAINTS తెలుగు
October 3. జపమాల మాత కు అంకితం చేయబడిన నెలలో మూడవరోజు 📿📿📿
ప్రార్థన :♥️♥️ దేవుని పరిశుద్ధ మాతా, ఈ పవిత్ర జపమాల మాసంలో మీ ప్రేమగల పవిత్ర వస్త్రముతో మమ్మల్ని కప్పి ఉంచండి. మా అడుగులను సరైన మార్గంలో నడిపించండి, మా హృదయాలకు శాంతిని, స్వస్థతను ప్రసాదించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వైపు మా కుటుంబాలను నడిపించి, మా గృహాలలో దైవాశీర్వాదాలు నింపమని వేడుకుంటున్నాము తల్లి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏
ఈ రోజు పునీత. ఇద్దరు ఎవాల్డ్ సోదరులు పండుగ 💐
వీరు క్రీస్తుశకం 695 లో జీవించిన గురువులు మరియు వేద సాక్షులు 💫💫💫
బంగారు మాట 🌟 ఓ మనిషి ! పరలోక రాజ్యానికి నీవు తప్ప వేరే ఖరీదు లేదు, దాని మూల్యం నీకు నీవే.
Sts .Two Ewalds గార్ల మా కొరకు ప్రార్థించండి 🙏
పరిశుద్ధ మరియమ్మ గారా ప్రతి నిత్యము మాకు తోడుగా ఉండండి ♥️ ♥️ ♥️
3 days ago | [YT] | 860
View 19 replies
VOICE OF SAINTS తెలుగు
October 2. జపమాల మాత కు అంకితం చేయబడిన నెలలో 2వ రోజు 📿📿📿📿
ప్రార్థన : ♥️♥️ ఓ పరిశుద్ధ జపమాల రాజ్ఞీ, మా ప్రియమైన మరియమాత! అక్టోబర్ జపమాల మాసంలో ఈ 2వ రోజున మేము మీ పాదాల చెంతకు చేరి, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. యేసుక్రీస్తును మాకు రక్షకునిగా ప్రసాదించిన ఓ కరుణామయీ, మా కుటుంబాలను మరియు మా జీవితాలను మీ పవిత్ర హస్తాలకు సమర్పిస్తున్నాము మమ్ములను దయతో కాచి కాపాడండి 🙏🙏
ఈరోజు పవిత్ర కావలి సన్మనస్కులు పండుగ 💐💐
ఒక్కొక్క మనిషిని ఆత్మ శరీర ఆపదల నుండి కాపాడుతూ మంచి పనులను చేయడంలో సహాయపడే మన కావలి దేవదూతలు 😍😍
పవిత్ర కావలి సన్మనస్కులారా మాకు తోడుగా ఉండండి ♥️♥️♥️♥️
పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి 🙏
4 days ago | [YT] | 613
View 12 replies
VOICE OF SAINTS తెలుగు
October 1. జపమాల మాత కు అంకితం చేయబడిన నెలలో మొదటి రోజు 📿 📿 📿 📿
ప్రార్ధన : ♥️ ఓ పరమ పవిత్ర దైవమాతా, పరిశుద్ధ జపమాల మాత అమ్మా మరియమ్మ! మా ప్రభువైన యేసుక్రీస్తు దివ్య ప్రకాశాన్ని మా హృదయాల్లో నింపుకోవడానికి అక్టోబర్ మాసపు మొదటి రోజైన నేడు నీ దివ్య సన్నిధికి వచ్చాము.
మా తల్లియైన నీ ప్రేమతో ఈ నెలాఖరు వరకు మా కుటుంబాన్ని, మా లోకాన్ని కాపాడు. నీ కుమారుడైన యేసు మార్గంలో నడుస్తూ, ప్రతీరోజూ భక్తితో జపమాల చెప్పడానికి మాకు కావలసిన కృపను ప్రసాదించు. మా కష్టాలలో, వేదనలలో మాకోసం నీ కుమారుని వేడుకొని మాకు శాంతిని, ఓదార్పును అనుగ్రహించండి. ఈ అక్టోబర్ నెల అంతా మీ మధ్యస్థ ప్రార్థనా సహాయముతో మమ్ములను దీవించండి 🙏 🙏🙏
ఈరోజు పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగ 💐 💐
వీరు క్రీస్తుశకం 1873 - 1897 మధ్య కాలంలో జీవించిన ఫ్రెంచ్ కార్మెల్ సభ కన్య స్త్రీ , లిసీయుక్స్ తెరేస - చిన్ని పుష్పం - బాల యేసుని చిన్న తెరిసా 😍😍
వీరు పూల వ్యాపారులు విదేశీ సువార్తికులు మరియు ఫ్రాన్స్ దేశ పాలక పునీతురాలు 😍 😍
బంగారు మాట 🌟 : ఏసుప్రభుకు కష్టం కలిగించే కార్యాలు చేయడం ద్వారా, వారి హృదయాన్ని గాయపరచడం ద్వారా మనకు ప్రభువుపై బలమైన నమ్మకం లేదని తెలుస్తోంది.♥️♥️
St.Therese Of Child Jesus గారా మా చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థించండి 🙏 🙏
పరిశుద్ధ జపమాల మాత మా కొరకు ప్రార్థించండి 🙏
5 days ago | [YT] | 600
View 10 replies
VOICE OF SAINTS తెలుగు
September 30. ఈ రోజు పునీత.జెరోమ్ గారి పండుగ 💐 💐 💐
వీరు క్రీస్తుశకం 341 - 420 లో జీవించిన గురువు, శ్రీ సభ పండితుడు, బైబిల్ శాస్త్ర పితామహుడు మరియు గ్రంథాలయల నిర్వహకుల పాలక పునీతుడు 💫 💫
బంగారు మాట 🌟 : ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండు ఎందుకంటే దేవుడు కానీ సాతాను కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ చేతినిండా పని ఉన్నట్లు నీవు కనిపించు. 😍♥️😍
ప్రార్థన :
ప్రభూ, నా యెడల నీ కరుణను చూపి, నా హృదయమును సంతోషపరచుము. యెరికో మార్గములో దొంగలచేత గద్దె దిగి, గాయపరచబడి, చనిపోయిననున్నాడని విడువబడిన వానివలె నేను ఉన్నాను. ఓ మంచి సమరయుడా, నాకు సహాయము చేయుము. తప్పిపోయిన గొర్రెవలె నేను ఉన్నాను. ఓ మంచి కాపరి, నన్ను వెదకి నీ చిత్తానుసారముగా నన్ను ఇంటికి చేర్చుము. నా జీవితకాలమంతయు నీ మందిరములో నివసించునట్లును, అక్కడ ఉన్నవారితో కలిసి ఎల్లకాలము నిన్ను స్తుతించి మహిమ పరిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించుము. ఆమేన్ ఆమెన్ ఆమెన్ 🙏 🙏 🙏
St.Jerome గారా మా కొరకు ప్రార్థించండి 🙏 🙏
6 days ago | [YT] | 106
View 6 replies
VOICE OF SAINTS తెలుగు
September 29.ఈ రోజు పునీత దేవదూతలు, మిఖాయేల్, గాబ్రియేల్, రఫాయేలు గార్ల పండుగ 💐
ప్రార్థన :♥️😇♥️
పవిత్రమైన ప్రధాన దేవదూతలారా, మా జీవిత ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి.పునీత మైఖేల్ గారా మమ్మల్ని రక్షించే రక్షకుడిగా ఉండండి.పునీత గాబ్రియేల్ గారా మాకు దేవుని స్వరాన్ని వినిపించే శుభవార్త దూతగా ఉండండి.పునీత రాఫెల్ గారా మా శరీరానికి, ఆత్మకు స్వస్థత చేకూర్చే వైద్యుడిగా ఉండండి.మమ్మల్ని దేవునికి దగ్గరగా నడిపించండి. ప్రతి నిత్యము మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచుకోండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏
పూర్తి చరిత్ర మన చానల్లో ఉంది దయచేసి ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి . మన ప్రధాన దేవదూతలు ముగ్గురు దేవుని సన్నిధిలో ఏం పని చేస్తారు ? మన ప్రధాన దేవదూతల గురించి పూర్తి విషయాలు తెలుసుకొని దేవదూతల సంరక్షణలో మీరు ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ God Bless You ALL ♥️♥️
👇👇👇👇https://youtu.be/bSm68G6927U?si=C1UvG... 🙏🙏
St.Michael, St. Gabriel St. Raphel గార్ల మా కొరకు ప్రార్థించండి 🙏🙏
1 week ago (edited) | [YT] | 29
View 10 replies
VOICE OF SAINTS తెలుగు
September 28. ఈ రోజు పునీత.వెన్ స్లాస్ గారి పండుగ 💐 💐
వీరు క్రీస్తుశకం 907 - 929 మధ్యకాలంలో జీవించిన
బొహేమియా రాజు , వేద సాక్షి , బొహేమియా,
చెకొస్లావేకియల పాలక పునీతుడు 💫 💫
బంగారు మాట 🌟 : అవిశ్వాసులగు వారితో వ్యవహరించుచున్నప్పుడు మీరు, మీకు గల ప్రతి అవకాశమును చక్కగా వినియోగించుకునుచు వివేకముతో ప్రవర్తింపడు ♥️♥️
ప్రార్థన : సర్వశక్తుడవైన దేవా, పరలోక రాజ్యమును భూలోక రాజ్యముకంటె మిన్నగా ఎంచవలెనని నీ రక్తసాక్షియైన పునీత విన్సెస్లాస్‌కు నేర్పిన దేవా, మా అంతఃకరణమును మేము అణచుకొనుచు, మా పూర్ణహృదయముతో నీయందే నిలిచియుండు కృపను మా పునీత విన్సెస్లాస్ గారి ప్రార్థనల ద్వారా మాకు ప్రసాదించుము.మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని ప్రార్థించుచున్నాము తండ్రి . ఆమెన్ ఆమెన్ 🙏
St.Wenceslaus, Martyr గారా మా కొరకు ప్రార్థించండి 🙏
1 week ago | [YT] | 3
View 5 replies
VOICE OF SAINTS తెలుగు
September 27. ఈ రోజు పునీత విన్సెంట్ డి పాల్ గారి పండుగ 💐 💐
వీరు క్రీస్తుశకం 1581 - 1660 మధ్యకాలంలో జీవించిన ఫ్రెంచ్ గురువు , విన్సెంట్ నియనుల సభ స్థాపకుడు. సిస్టర్స్ ఆఫ్ చారిటీ సభకు సహాయకారి , దాన దాతృత్వ సంఘాల పాలక పునీతుడు ♥️♥️
బంగారు మాట 🌟: అసూయను పరితపించుటలో జాగ్రత్త వహించు. అది సోదర ప్రేమతో కూడిన దాతృత్వ స్వభావాన్ని నాశనం చేయ వెతుకులాడుతుంది.💫💫
ప్రార్థన : ఓ పునీతా విన్సెంట్ గారా అన్ని దాతృత్వ సంఘాల పోషకుడా !
ప్రభువు నుండి పేదలకు సహాయాన్ని, బలహీనులకు ఉపశమనాన్ని, బాధలో ఉన్నవారికి ఓదార్పును, దిక్కులేని వారికి రక్షణను పొందజేయండి.
ధనవంతులలో ఉదార స్వభావాన్ని, పాపులలో మనశ్శాంతిని, పూజారులలో దైవ ఉత్సాహాన్ని, చర్చికి శాంతిని ప్రసాదించమని ప్రార్థించండి.
మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము నిత్యజీవితంలో ఐక్యమై, శాశ్వత ఆనందాన్ని పొందేలా కృప చూపండి. మేము కూడా మీ మాదిరిని అనుసరించి నీ వలె పేదలకు సహాయం చేసే మంచి మనసును మాకు దయచేసి విశ్వాసములో బలముగా ఉండేలా మా కొరకు ప్రార్థించండి. 🙏
పునీత. విన్సెంట్ డి పాల్ గారా పేదలు మరియు నిరాశ్రయుల కొరకు ప్రార్థించండి 🙏 🙏
1 week ago (edited) | [YT] | 4
View 14 replies
Load more