IMPORTANT NOTE :
Telugu Tv Channel,Village Entertainments,Short films,Folk Songs Latest,News update, Live,Live Shows, Entertainment, Video Songs, Audio Songs, Interviews published on our 69 Tv Telugu Channel
All kinds of programs are not meant to humiliate anyone.
We are broadcasting. If there are any comments, compliant, copyrights on these please pre-mail my mail
Can give information.our mail : www.69tvnews@gmail.com
THANK YOU
Copyright Notice: Please feel free to leave me a notice if you find this upload inappropriat
69Tv Telugu Channel is one of the leaders in the production and un-biased and comprehensive news and entertainment programmes in India and abroad
69Tv Telugu delivers reliable information across all platforms:TV, Internet and Mobile.
Thank U For Watching
Citizen 69Live
ముత్తారం SI రవికుమార్ గారికి దసరా శుభాకాంక్షలు -
ఉపసర్పంచ్ అమ్ము రజిత-శ్రీనివాస్
పెద్దపల్లి జిల్లా : ముత్తారం మండలం ముత్తారం గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ముత్తారం ఉపసర్పంచ్ అమ్ము రజిత-శ్రీనివాస్ లు ముత్తారం ఎస్సై రవికుమార్ గారిని శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారి వెంట పలువురు వార్డు మెంబర్ లు స్థానికులు ఉన్నారు.
2 weeks ago (edited) | [YT] | 5
View 0 replies
Citizen 69Live
ముత్తారం గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు ....
తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండగ సంబరాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి.ఈ సందర్భంగా తెలంగాణా పూల పండుగ సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ముత్తారం మాజీ ZPTC నాగినేని జగన్మోహన్ రావు మరియు గ్రామ సర్పంచ్ సూదాటి రవీందర్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల కోసం గ్రామంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ దీపాలు, అలంకరణ దీపాల ఏర్పాటు,మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం చదును చేసి దాదపు 250 ట్రాక్టర్ ల మట్టిని పోయించి సౌకర్యంగా ఉండే విధంగా బతుకమ్మ సంబరాల ప్రాంగణంలో పలు మౌలిక సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా సంబరాలకు వచ్చే ప్రజలకు,మహిళలలకు,పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఘనంగా ఏర్పాట్లు చేశారు.
3 weeks ago (edited) | [YT] | 20
View 0 replies
Citizen 69Live
*మహాచండీయాగంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష దంపతులు*
ఈరోజు ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామంలో లీడర్ యూత్ ఆధ్వర్యంలోదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకొని దుర్గామాత మండపంలో నిర్వహించిన చండీ హోమం కార్యక్రమంలో పాల్గొన్న ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ-గీతా రాణి దంపతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో రైతులకు పంటలు విరివిగా పండి ప్రజలందరూ సుఖసంతోషాలు ఉండాలని ప్రజల జీవితాల్లో శాంతి సౌభాగ్యం నిండాలని అమ్మవారినీ వేడుకోవడం జరిగింది
కార్యక్రమంలో భవాని దీక్ష పరులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
3 weeks ago | [YT] | 7
View 0 replies
Citizen 69Live
ఎల్నీనో ఎఫెక్ట్.. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయంటే?
ఎల్నీలనో.. రైతుల నుంచి సామాన్య ప్రజలకు వరకు ప్రతి ఒక్కరికీ ఇది పెను శాపంగా మారింది. ఓ పక్క వర్షాలు లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు ఉత్పత్తి తగ్గి నిత్యావసర వస్తుల ధరలు పెరిగి సమాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెరకు ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తి దారైన మన దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎల్‌నినో తీవ్రరూపం దాల్చడంతో దేశంలో చక్కెర ఉత్పత్తిపై తీవ్ర ఆందోళనలు నెకొన్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో చెరకు దిగుబడి మరింత పడిపోయే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4 weeks ago | [YT] | 0
View 0 replies
Citizen 69Live
మహిళలకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో 264 అంగన్వాడీ టీచర్లు, ఆయా ఉద్యోగాలు..
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. వికారాబాద్ జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 264 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు 102, అంగన్వాడీ ఆయాలు పోస్టులు 162 వరకు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థులు 2026 అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
4 weeks ago | [YT] | 2
View 0 replies
Citizen 69Live
నాని.. బ్లడీ రోమియోగా న్యాచురల్ స్టార్..
టాలీవుడ్ స్టార్ హీరో నాని తన ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి విభిన్న గెటప్కైనా సిద్ధపడే ఆయన, తాజాగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘బ్లడీ రోమియో’ కోసం పూర్తిగా కొత్త అవతారంలోకి మారిపోయారు. ఇటీవలి కాలంలో ది ప్యారడైజ్ సినిమా కోసం పూర్తిగా రగ్డ్, మాస్ లుక్‌లో కనిపించిన నాని, ఈ సినిమా కోసం అల్ట్రా-స్టైలిష్ అండ్ క్లాసీ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ కొత్త మేకోవర్‌కు సంబంధించిన లుక్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ డిజైనర్ ఆలిమ్ హకీమ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ కొత్త లుక్‌లో నాని ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ట్రెండీ కర్లీ మల్లెట్ హెయిర్‌స్టైల్, దానికి తగినట్లుగా ధరించిన బ్లాక్ రౌండ్ సన్‌గ్లాసెస్ ఆయనకు సరికొత్త స్వాగ్‌ను తీసుకొచ్చాయి. దర్శకుడు సుజీత్ ఈ చిత్రం కోసం నానిని మునుపెన్నడూ చూడని సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. నిహారికా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.
4 weeks ago | [YT] | 7
View 0 replies
Citizen 69Live
పండుగ సీజన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు..
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చికెన్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో కిలో చికెన్ ధర రూ.50కి పైగా పెరిగి.. ప్రస్తుతం రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజల దైనందిన జీవితంపై గణనీయమైన భారాన్ని మోపుతోంది. సరఫరాలో హెచ్చుతగ్గులు, పెరిగిన డిమాండ్, అలాగే రవాణా ఖర్చులు ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. పండుగల సీజన్‌కు ముందు మాంసాహార పదార్థాల ధరలు పెరగడం వినియోగదారులలో ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావంతో హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహార భోజన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ అకస్మాత్తు ధరల పెరుగుదల గృహ బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రొటీన్ ఆహారంగా ప్రాచుర్యం పొందిన చికెన్ ధరలు పెరగడం వల్ల చాలా కుటుంబాలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఈ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
4 weeks ago | [YT] | 0
View 0 replies
Citizen 69Live
ఓడేడ్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలకు ఘనంగా ఏర్పాట్లు ....
తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ పండగతో సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి.ఈ సందర్భంగా తెలంగాణా పూల పండుగ సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ సర్పంచ్ పోతుపెద్ది కవిత-కిషన్ రెడ్డి మరియు గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల కోసం గ్రామంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ దీపాలు,అలంకరణ దీపాల ఏర్పాటు,మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం చదును చేసి సౌకర్యంగా ఉండే విధంగా బతుకమ్మ సంబరాల ప్రాంగణంలో పలు మౌలిక సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా సంబరాలకు వచ్చే ప్రజలకు,మహిళలలకు,పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఘనంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
4 weeks ago | [YT] | 13
View 0 replies
Citizen 69Live
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయుడికి పూర్వ విద్యార్థుల సన్మానం ....
పెద్దపల్లి జిలా ముత్తారం మండలం ముత్తారం గ్రామంలో గత 3 దశాబ్దాలుగా ప్రైవేటు ఉపాధ్యాయుడిగా అత్యుత్తమ విద్యను బోధిస్తూ ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన రాపెల్లి అశోక్ గారికి డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి ఉత్తమ విద్యా బోధనను గుర్తించి పెద్దపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానం మరియు ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా రాపెల్లి అశోక్ గారు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్న నేపథ్యంలో పూర్వవిధ్యార్తులు మరియు స్థానిక గ్రామస్థులు కలిసి వారిని శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించడం జరిగింది.
2 months ago | [YT] | 10
View 0 replies
Citizen 69Live
వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
వేములవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. 'వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్.. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్' అంటూ హరిహర క్షేత్రమైన వేములవాడలో ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలో విశేష పూజలు
తెల్లవారుజామునే మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవలతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఆలయ ప్రాంగణంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఉపాలయాల్లో స్వామివార్లకు బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పంచోపచార పూజలు శాస్త్రోక్తంగా నిర్వర్తించారు.
ఉత్సవమూర్తులకు పట్టువస్త్రాలు, విశేష పుష్పాలతో అలంకరించి ఏకాంతంగా విశేష అర్చనలు జరిపారు.
సనాతన సంప్రదాయాన్ని అనుసరించి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రంలో ప్రదోష కాల పూజలు వైభవంగా నిర్వహించారు.
ఆకట్టుకున్న ఉట్టి సంబరాలు పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన 'ఉట్టి కొట్టే' కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. భక్తులు తమ చిన్నారులను శ్రీకృష్ణుడు, రాధల వేషధారణలతో ఆలయానికి తీసుకువచ్చి ఉత్సవంలో భాగస్వాములను చేశారు. చిన్నారులు ఉత్సాహంగా ఉట్లను కొట్టి సందడి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
2 months ago | [YT] | 7
View 0 replies
Load more