News Room Telugu

NEWS ROOM brings you accurate, unbiased, and ground-level reporting.
We focus on real stories, verified facts, and voices that matter.

From breaking news to in-depth analysis, politics to public issues —
we report without fear or favour.

Truth First. Facts Only.

📌 Breaking News
📌 Ground Reports
📌 Public Issues
📌 Exclusive Stories
📌 Honest Journalism

Subscribe and stay informed with NEWS ROOM.


News Room Telugu

🌸 విజయదశమి (దసరా) శుభాకాంక్షలు! 🌸

సమస్త 'News Room Telugu' కుటుంబ సభ్యులకు, తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు. జమ్మి చెట్టు నీడన మీ జీవితం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. 🙏✨

అప్‌డేట్స్ ఎప్పుడూ వేగంగా, నిజాయితీగా మీ ముందుకు తీసుకువచ్చే మన ప్రయాణంలో నిత్యం తోడుగా ఉంటున్న మీ అందరికీ ధన్యవాదాలు!

— మీ న్యూస్ రూమ్ తెలుగు టీమ్ 📺

#Dussehra2026 #Vijayadashami #NewsRoomTelugu #HappyDussehra #TeluguNews

1 day ago | [YT] | 41

News Room Telugu

మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా, మంత్రి నారా లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
#NaraLokesh
#AndhraPradesh

1 day ago | [YT] | 100

News Room Telugu

కిమ్ ను మళ్ళీ చంపేశారు..!!

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ పై తరచూ మృతి చెందినట్లుగా వార్తలు వస్తుంటాయి..!

తాజాగా మరోసారి అలాంటి వార్తనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..!

పైగా పొంతన లేకుండా ఎవరికీ వారు కథలు అల్లుతున్నారు..!

తాజా స్టోరీలో మెదడులో రక్తస్రావం వల్ల ఉన్నఫళంగా కుప్పకూలిన కిమ్ కోమాలోకి వెళ్ళాడని..బ్రెయిన్ డెడ్ అయ్యాడంటూ పోస్ట్ చేస్తున్నారు..!

నిజానికి.ఇదంతా ఫేక్ న్యూస్..!

ఇజ్రాయిల్ పై కామెంట్స్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే కిమ్ పై ఈ తరహా ప్రచారం మొదలు కావడంతో.. ఇదంత వాళ్లపనే అని..అమెరికా హస్తం కూడా ఉందంటూ కిమ్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు..!

1 day ago | [YT] | 4

News Room Telugu

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. 21 వేల మందికి ఉపాధి అవకాశాలు!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ Haier భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా సత్యవేడులో 250 ఎకరాల్లో రూ.7,000 కోట్లతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండు దశల్లో పెట్టుబడులు పెట్టి 2032 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.

#Haier #AndhraPradesh

1 day ago | [YT] | 6

News Room Telugu

యూట్యూబ్ సెన్సేషన్ #Ajay హీరోగా కొత్త సినిమా ప్రారంభం!

యూట్యూబ్‌లో #AyeJude గా గుర్తింపు పొందిన అజయ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాము కొప్పుల దర్శకత్వంలో నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకులు #BGopal #HarishShankar #BuchiBabuSana చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

#AyeJude01 #TeluguCinema

3 days ago | [YT] | 7

News Room Telugu

'లతా రెడ్డి’గా కొత్త అవతారం! ❤️‍🔥

టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ సంక్రాంతికి ‘లతా రెడ్డి’గా సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు కీర్తి సిద్ధమవుతున్నారు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్, అనిల్ రావిపూడి తదితరులు భాగమైన ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 💥🥳

#KeerthySuresh #January12Vidudala

3 days ago | [YT] | 30

News Room Telugu

ఇద్దరు అమ్మాయిలు.. ఒకే అబ్బాయి! జాన్వీ, శ్రీలీలతో రొమాంటిక్ థ్రిల్లర్! 🎬

జాన్వీ కపూర్, శ్రీలీల కలిసి ఓ హిందీ సినిమాలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ గుప్తా హీరోగా, ఉమేశ్ బిస్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ఇష్టపడటం కథాంశంగా తెలుస్తోంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో షూటింగ్ జరిగినట్లు సమాచారం.

#JanhviKapoor #Sreeleela

3 days ago | [YT] | 6

News Room Telugu

ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి వేరే పార్టీకి దక్కిన సీటు

సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సీటును బీసీ మహిళకు కేటాయించడంతో ప్రియురాలు మంజీరను పెళ్లి చేసుకున్న టీడీపీ నేత హర్షవర్ధన్

భార్యను ఎన్నికల్లో పోటీ చేయించాలని ఎవరినీ పిలవకుండా గుడిలో పెళ్లి చేసుకున్న హర్షవర్ధన్ ఆశలు ఆవిరి

కూటమి సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీకి దక్కిన సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం

4 days ago | [YT] | 12

News Room Telugu

ఒక్కరి రక్తదానం ఆపదలో ఉన్న మరో కుటుంబానికి జీవన ప్రదాత అవుతుంది. ప్రాణాపాయంలో ఉన్నవారికి పునర్జన్మనిస్తుంది. రక్తం అందక ఏ ఒక్క ప్రాణమూ ప్రమాదంలో పడకూడదనే సంకల్పంతో విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయం. సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సహా వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. తలసేమియా చిన్నారులకు ఉచిత రక్తం అందించడం గొప్ప మానవీయ సేవ. విద్య, వైద్యం, మహిళా సాధికారత సహా ఎన్నో రంగాల్లో సేవలందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మరింత మందికి అండగా నిలవాలి. సంజీవని మొబైల్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేయడం స్ఫూర్తిదాయకం. ప్రతి సేవలో మానవత్వం, ప్రతి ప్రయత్నంలో ప్రాణ రక్షణే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@ManagingTrustee

@ntrtrust

4 days ago | [YT] | 140

News Room Telugu

మోడీకి మద్దతుగా ఒవైసీ

మన దేశాన్ని, రాజ్యాంగబద్ధమైన పదవులను అవమానించడాన్ని నేను సహించను

ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటాను మనం వినియోగిస్తున్నాం

– అసదుద్దీన్ ఓవైసీ

4 days ago | [YT] | 11