వర్తమాన అంశాల మీద లోతైన విశ్లేషణల కోసం చూస్తున్నారా? కనిపించే వార్తల వెనక కనిపించని కోణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దశాబ్ధాల అనుభవం, అపారమైన అధ్యయనం కలిగిన జర్నలిస్టుల విశ్లేషణలను ఇక్కడ మీరు చూడొచ్చు.
రాజకీయాలతో పాటు, జీవితం, చరిత్ర, న్యాయం, ఆరోగ్యం వంటి అన్ని విషయాలు గురించి చర్చించే వేదికగా ఈ ఛానల్ ఉంటుంది. దాంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై గ్రౌండ్ రిపోర్టులు, డాక్యుమెంటరీలు, టెలి ఫిలింలకు కూడా #MahuaMedia ఒక వేదికగా ఉంటుంది.

Mahua Media is a space for social concerns run by media professionals. It also brings analysis on current affairs and talks about all aspects of people, life, literature and arts.
Paid Members గా ఛానల్ ను సపోర్ట్ చెయ్యండి. Link below 👇


Mahua Media

12 minutes ago | [YT] | 14

Mahua Media

Subscribe ‪@MahuaCinema‬ for movie reviews and analysis https://youtu.be/DUjzq3ArZMg

2 hours ago | [YT] | 0

Mahua Media

Jantar Mantar 2.0

3 hours ago | [YT] | 181

Mahua Media

Subscribe ‪@MahuaCinema‬ for movie reviews and analysis https://youtu.be/DkA7OY8zbq8

20 hours ago | [YT] | 0

Mahua Media

"నేరం జరిగింది నిజమే, విచారణ సరిగా జరగలేదన్నదీ నిజమే, దానివల్ల 23 మంది దోషులు తప్పించుకున్నదీ నిజమే, కాబట్టి దీన్ని విచారణ చేపట్టాలన్న పిటిషన్ అంగీకరిస్తాం. కానీ ఆ ప్రధాన నిందితుడిని మాత్రం విచారించవద్దు. " ఇదీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల లాజిక్. నేరమే రాజకీయమైతే న్యాయం ఎలా ఉంటుందో చూడండి.
https://youtu.be/thBlzbjjUfo

1 day ago | [YT] | 4

Mahua Media

ఏందక్కా ఇది!
#vandemataram

1 day ago | [YT] | 443

Mahua Media

కామెంట్ ప్లీజ్!
#bangladesh #durgapuja

1 day ago | [YT] | 198

Mahua Media

UPI ఛార్జిల వివాదం సుప్రీమ్ కోర్ట్ కి ఎక్కింది. ఇది ప్రజల నుంచి "expropriation" చెయ్యటమే అని తీవ్రమైన వ్యాఖ్య చేసిన కోర్ట్ స్టే మాత్రం ఇవ్వలేదు.
https://youtu.be/jp1R3W9H_Jo

2 days ago (edited) | [YT] | 29

Mahua Media

మొద రాత్రి సినిమా ఇప్పటికే చాలామంది చూసేసి ఉంటారు కదా. దాని మీద ‪@MahuaCinema‬ లో Kausalya ఒక మంచి ఎనాలిసిస్ చేసింది. లింక్ కామెంట్స్ లో పెడతాను. వీలయితే చూడండి. ఈ పోస్ట్ సినిమా గురించి కాదు డైరెక్టర్ రాజా కరుప్పసామి గురించి, సినిమా టెక్నిక్ లో నరేషన్ లో వాడిన ఒకటి రెండు ఆసక్తికరమైన అంశాల గురించి.

మా అబ్బాయి తమిళ్ సినిమాలను, చిన్న సినిమాలను బాగా ఫాలో అవుతాడు. మా ఇంట్లో ఎవరు సినిమా చూసినా, టీవీ చూసిన హాల్ లోనే చూడాలి అనేది రూల్. ఈ మధ్య ఒక రోజు తను ఈ సినిమా చూస్తున్నాడు. మధ్యలో వెళ్లి పక్కన కూర్చుని చూడటం మొదలు పెట్టి హుక్ అయ్యి మొదటి సగం ఆ మర్నాడు చూసాను. అరే సినిమా భలే ఉందే అని అడిగి మరీ కౌసల్య తో రివ్యూ చేయించాను.

సినిమా మేకింగ్ గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక single long take / plan sequence చూసి ఆశ్చర్యం వేసింది. అప్పటికే ఎవరీ డైరెక్టర్ అని సెర్చ్ చేసి ఉన్నా కాబట్టి, ఇది అతని మొదటి సినిమా అని, అందులో నితీష్ గా వేసిన అబ్బాయే డైరెక్టర్ రాజా కరుప్పసామి అని, స్నేహం కోసం రిషికాంత్ వంటి రైజింగ్ యాక్టర్ కూడా ఇందులో ఫ్రీ గా చేశాడని తెలిసింది. కానీ మొదటి సినిమా కే లాంగ్ టేక్ / ప్లాన్ సీక్వెన్స్ చెయ్యటం అంటే చాలా ధైర్యం కావాలి. పైగా అందులో చాలామంది కొత్త వాళ్ళు. అంతమంది కొత్తవాళ్లతో అలాంటి సీక్వెన్స్ చెయ్యటం చిన్న విషయం కాదు.

సింగల్ లాంగ్ టేక్ అంటే.. ఒక సీన్ అంతా షాట్స్ కింద విడివిడిగా కట్ చెయ్యకుండా continuous గా షూట్ చెయ్యటం. సినిమా పుట్టిన కొత్తలో, ఇంకా ఎడిటింగ్ ప్రక్రియ పుట్టని రోజుల్లో ఇది తప్పనిసరి అయి వాడితే, దీన్ని ఒక ఆర్ట్ గా మలిచింది మాత్రం ఫ్రెంచ్ న్యూ వేవ్ సినిమా. దాన్ని మోడరన్ సినిమా లో కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ లాంగ్ షాట్ అంటే కెమెరా ఒక చోట ఉండదు. కెమెరా మల్టీపుల్ క్యారెక్టర్స్ ను డైలాగ్స్ ను సెటప్స్ నీ ఫాలో అవుతూ ఉంటుంది. లాంగ్ ఫ్లూయిడ్ టేక్స్ ఇవి. దానికి చాలా ప్లానింగ్ కావాలి, యాక్టర్స్ తో, కెమెరా అండ్ లైటింగ్ టీమ్ తో.
1994 లో క్వింటిన్ టొరంటినో తీసిన పల్ప్ ఫిక్షన్ లో ఇలాటి సీక్వెన్సులు చాలా పాపులర్. అ తర్వాత నాలుగేళ్లకు తెలుగులో సురేష్ కృష్ణ తీసిన ఆహా లో ఫస్ట్ సీన్ కూడా అదే. 2014 లో వచ్చిన బర్డ్ మాన్ మొత్తం సినిమా ఒక లాంగ్ షాట్ లా ఉంటుంది కానీ కాదు. విడివిడిగా షూట్ చేసి డిజిటల్ స్టిచ్ చేసి సినిమా అంతా ఒక లాంగ్ షాట్ లా కనపడేలాగా చేశారు. ఈ మధ్య వచ్చిన విడుదలై లో మొదటి సీన్ ట్రైన్ ఆక్సిడెంట్ కూడా సింగిల్ లాంగ్ టేక్. అంత పెద్ద ట్రైన్ ఆక్సిడెంట్ అందులోనూ అనేక క్యారెక్టర్స్, ఒక ఓపెన్ ఏరియా లో చెయ్యటం చాలా పెద్ద సాహసం.

ఆ మధ్య అడోలసెన్స్ అని ఒక 4 గంటల సిరీస్ వచ్చింది. సూపర్ సిరీస్. ఆ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే అందులో ఒక్కొక్క ఎపిసోడ్ సుమారు గంట ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక సింగిల్ లాంగ్ టేక్. కట్ చేసి కనపడకుండా స్టిచ్ చెయ్యటం లాంటి జిమ్మిక్స్ కూడా చెయ్యలేదు. పైగా ప్రతి ఎపిసోడ్ మల్టిపుల్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు. . ఇంట్లోంచి, వెహికల్ లోకీ, వెహికల్ లోంచి పోలీస్ స్టేషన్, అక్కడా మల్టీపుల్ రూమ్స్ లోకి కెమెరా వెళ్తూనే ఉంటుంది. చివరికి దూకేసే పరుగెట్టే సీక్వెన్స్ లో కూడా కెమెరా అలాగే దూకి పరుగెడుతుంది. ఎక్కడ చిన్న తప్పు జరిగినా మళ్లీ మొట్ట మొదటినుంచి మొదలు పెట్టాలి. అలా అ నాలుగు సింగిల్ టేక్స్ కోసం వాళ్లు ప్లానింగ్ లో నెలల తరబడి షూటింగ్ లో రోజుల తరబడి పని చేశారు. ఓపిక ఉంటే దీని మీద డైరెక్టర్ తో సినిమాతో గ్రాఫర్ తో ఇంటర్వ్యూలు, ఎనాలిసిస్ లు చాలా ఉన్నాయి చూడండి.

లోపల ఉన్న సినిమా టీచర్ నిద్ర లేచి కొంచెం దారి తప్పాను సారీ. మళ్లీ మన మొద రాత్రి సినిమా కు వద్దాం. అందులో పెళ్లి జరిగే చోట పెళ్లి కూతురు రూమ్ లో పెళ్లి కొడుకు రూమ్ లో అటు ఇటు ఉన్న బంధువుల మధ్య జరిగే కొన్ని సీన్లను ఒక సింగిల్ లాంగ్ టేక్ కింద తీశారు. అంతమంది కొత్త వాళ్లతో ఒక కొత్త డైరెక్టర్ దాన్ని తియ్యటం చిన్న విషయం కాదు. తాను కూడా పల్ప్ ఫిక్షన్ నుంచే ఇన్స్పైర్ అయ్యాను అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ అందులో ఉన్న గ్రామ దేవత. జనాలకు పురాణ కథల్లో ఉండే దేవుళ్ల మీద క్రేజ్ పెరిగాక గ్రామ దేవతలను పట్టించుకోక పోవటం, దీని వెనక ఉన్న ఆర్యన్, ద్రవిడియన్ conflict లోకీ నేను వెళ్లను కానీ ఈ కథ జరిగే ఊళ్ళో ఒక గ్రామ దేవుడు ఉంటాడు. ఆయనే కరుప్పసామి. మన పోలేరమ్మ లాగా. మన డైరెక్టర్ పేరు కూడా అదే రాజా కరుప్పసామి. తన పేరు వెనక ఉన్న కథ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అతనికి ఈ గ్రామ దేవతలు, దేవుళ్ల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపు, వాటికి పూజారులు గా పని చేసేవాళ్ళ ఫ్రస్టేషన్ అర్హమయింది. దాన్ని ఈ సినిమా లో బాగా వాడుకున్నాడు.

ఇంకో క్యూట్ డీటెయిల్ చెప్పి ఆపేస్తాను. ఈ డైరెక్టర్ సినిమా తీసినప్పుడు తన తండ్రికి తప్పకుండా ఒక రోల్ ఇవ్వాలనుకున్నాడట. కానీ సినిమా తీసేసరికి ఆయన చనిపోయారు. కాబట్టి సినిమాలో చనిపోయిన ఒక వ్యక్తికి చాలా కీలకమైన రోల్ ఇచ్చి ఆయన ఫోటో కి దండేసి ఊరుకోకుండా, ఒక క్యారెక్టర్ ఆ ఫోటో పట్టుకుని సినిమా అంతా తిరిగేలా డిజైన్ చేశాడు. భలే అనిపించింది.
ఇంతకీ ఈ సినిమా తీసింది తెలుగు ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్. వీళ్లు తెలుగు డైరెక్టర్ ఎవరన్నా ఇలాంటి స్క్రిప్ట్ పట్టుకుని వెళ్తే తీసేవాళ్లో కాదో మరి.

3 days ago | [YT] | 103

Mahua Media

Subscribe ‪@MahuaCinema‬ for movie reviews and analysis https://youtu.be/qoeGXRbYMlE

3 days ago | [YT] | 2