Think Telugu Podcast 

Think Telugu Podcast


Think Telugu Podcast

📚📒📕

1 hour ago | [YT] | 7

Think Telugu Podcast

🎧🎙️

1 week ago | [YT] | 109

Think Telugu Podcast

అప్పుడెప్పుడో మన జ్ఞానాన్ని పక్కదేశాల వాళ్లు నాశనం చేశారని, దోచుకున్నారని పనికిరాని మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాం.

మన చేతకానితనాన్ని సమర్థించుకోవడానికి చాలా సౌకర్యంగా ఉపయోగపడే కథ అది.

మరి ఇదేంటి?

ఇప్పుడు మన జ్ఞానాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు?

ఇప్పుడు మనం పీకేది ఏంటి?

ఇది ఆంధ్రా యూనివర్సిటీ Main Library లోని పరిస్థితి.

"జ్ఞానాన్ని నాశనం చేయడానికి బుక్స్ ని కాల్చాల్సిన అవసరం లేదు.
ఇదుగో వాటిని ఇలా సంవత్సరాల పాటు పట్టించుకోకుండా వదిలేస్తే చాలు."


Books కాలిపోతే కనీసం అవి కాలిపోయాయని తెలుస్తుంది.

ఇలా వదిలేస్తే మాత్రం

జ్ఞానం నెమ్మదిగా కుళ్లిపోతుంది. చెదపురుగుల పాలవుతుంది.

LIBRARY OF CONGRESS లో books కోసం controlled temperature, relative humidity, light, cleanliness, shelving, air quality వంటి environmental conditions‌ను పాటిస్తారు. ఇక చనిపోయే books కోసం వాళ్ళు తీసుకునే care అంతా ఇంతా కాదు.

మరి మన దగ్గర?

పుస్తకాన్ని వెతుక్కోవడానికి కనీసం ఒక ట్యూబ్‌లైట్ కూడా లేదు

ఒక వైపు ప్రపంచంలోని గొప్ప గ్రంథాలయాలు
“ఈ పుస్తకం ఇంకో వందేళ్లు ఎలా బతకాలి?” అని ఆలోచిస్తున్నాయి.

మరో వైపు మనం
“ఇది ఇంకా ఇక్కడ ఉందా?” అని వెతుక్కుంటున్నాం.

మన పూర్వీకుల జ్ఞానాన్ని ఎవరో నాశనం చేశారని బాధపడటం చాలా సులభం.

కానీ మన చేతుల్లో ఉన్న జ్ఞానాన్ని మనమే protect చెయ్యకపోతే.....,

దానికి విదేశీయుల్ని నిందించడం వల్ల use ఏంటి ?

జ్ఞానాన్ని దోచుకోవడం ఒక రకమైన విధ్వంసం.

జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం ఇంకొక రకం. అది విధ్వంసం కంటే danger!


మొదటిదానికి చరిత్రలో దోషులను వెతుక్కోవచ్చు.

రెండోదానికి మాత్రం
చెదపురుగులని నిందించి, వాటికి వెతకటం మాత్రం కష్టం.

1 month ago | [YT] | 584

Think Telugu Podcast

ఆ fisherman, 3 hours నుంచి తన గేలాన్ని సముద్రంలోకి విసురుతూనే ఉన్నాడు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. so నిరాశతో ఇంటికి వెళ్తున్నాడు.

ఒక్క చేప కూడా పడలేదు కదా... రేపు మళ్ళీ వస్తావా? అని అడిగాను.

అప్పుడు అతని సమాధానం : 30 years గా వస్తూనే ఉన్నాను. మాకిది అలవాటే.

అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే - అతను రేపు ఒక ఆశతో వస్తాడా? లేదా తన Nature (స్వభావం) తో వస్తాడా?

i mean....మనిషి ఆశతో బ్రతుకుతాడా? స్వభావం తో బ్రతుకుతాడా?

perhaps స్వభావంతో బ్రతికితే - ప్రతిరోజూ fish దొరక్క పోయినా... అతనికి ఆదాయం లేకపోయినా.. family పస్తులతో ఉన్నా.... తన స్వభావం ఇంకా అలానే చెక్కుచెదరకుండా ఉంటుందా? లేదా ఆకలి తన స్వభావాన్ని మింగేస్తుందా?

1 month ago | [YT] | 406

Think Telugu Podcast

గ్రీకుల నుంచి గుర్రాలని,
కాషాయకాంతల నుంచి కమలాలని gift గా పొందకూడదు.

1 month ago | [YT] | 597

Think Telugu Podcast

దేశ నలుమూలల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మోదీ కి cockroaches/ students life,future గుర్తుకు వచ్చిందా? లేదా తప్పు జరిగింది కాబట్టి గుర్తుకువచ్చిందా?

ఇదే action, paper leak అయిన రోజే తీసుకోవచ్చుగా? వ్యతిరేకత ఎక్కువైనప్పుడు ఎందుకు?

యువత భవిష్యత్ తో ఆటలంటే ఇది కాదా...?

"మనుషులు తప్పు చేసినందుకు బాధపడరు. ఆ తప్పు బయటపడినందుకు బాధపడతారు! భయపడతారు!"

1 month ago (edited) | [YT] | 477

Think Telugu Podcast

Sicily లో 1848 jan లో ఆహార కొరత వల్ల అల్లర్లు చెలరేగాయి. అలా చిలికి చిలికి గాలివానగా మారి విప్లవం france కు చేరుకుంది. కానీ అక్కడున్న LOUIS PHILIPPE ఒక మూర్ఖుడు.

ఎందుకంటే " చలికాలంలో ఎవరూ తిరుగుబాటు చెయ్యరు, వేసవికాలం వరుకు ఆగుతారులే " అనుకున్నాడు.

2 months ago | [YT] | 472

Think Telugu Podcast

ప్రజలు ఒక మంచి రాజాకీయ నాయకుణ్ణి కోరుకుంటారు.
కానీ అలాంటి వాళ్ళు చాలా అరుదు.
so ఇక గతిలేక మంచిగా నటించే నాయకులని accept చేస్తారు.
చివరికి రౌడీని, దుర్మార్గున్ని, నరరూప రాక్షసుణ్ణి కూడా accept చేస్తారు.
but ఒక comedian ని మాత్రం accept చెయ్యరు.

రాజకీయ భాషలో చెప్పాలంటే - విలువలు, విశ్వసనీయత కోల్పోతారు.

2 months ago | [YT] | 317