Rajashekar Sharma

Exploring Sanatan Dharma in Details..🚩

మనం పఠించే లేదా జపించేటప్పుడు మంత్రం యొక్క అర్థం తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మంత్ర పఠించే సమయంలో అర్థం తెలిసినట్లైతే మంత్రంలోని దేవిదేవతల రూపం, భావనలు మనకు అర్థం అవ్వటం వలన జపిం, ధ్యానం చేసే సమయంలో ఏకాగ్రత, విశ్వాసం పెరుగుతుంది. వారి అనుగ్రహం లభిస్తుంది.

అత్యంత శక్తివంతమైన ప్రముఖ మంత్రాలకు, స్తోత్రాలకు, శ్లోకాలకు సరళా తెలుగు బాషలో అర్థం, భావం అందించబడుతుంది. చానల్ ని అందరికీ youtube.com/@RajaShekarSharma చానల్షే ని ర్ చేసి మన సనాతన ధర్మంలోని విశేషమైన మంత్రాల యొక్క అర్థం అందరూ తెలుసుకునే అవకాశం కల్పించండి.


Rajashekar Sharma

రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక , ఏడు జన్మల్లో చేసిన పాపములను , ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

8 months ago | [YT] | 25

Rajashekar Sharma

ప్రత్యక్ష దైవం సూర్యుడికి రథసప్తమి అత్యంత ముఖ్యమైన పర్వదినం. ప్రత్యక్ష దైవం సూర్యుడికి రథసప్తమి అత్యంత ముఖ్యమైన పర్వదినం. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మాఘ మాస శుక్ల పక్ష సప్తమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు.

🔅 సూర్య జయంతి
పురాణాల ప్రకారం, ఈ రోజే సూర్యభగవానుడు అదితి, కశ్యప బ్రహ్మలకు జన్మించాడు. సూర్యుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజుగా దీనిని భావిస్తారు. అందుకే దీనిని "రథ సప్తమి" అంటారు.

🔅 ఆరోగ్య ప్రదాయిని
"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని అంటారు. అంటే ఆరోగ్యం కోసం సూర్యుడిని ఆరాధించాలి. రథసప్తమి నాడు చేసే స్నానం, పూజ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా చర్మ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.

🔅 జిల్లేడు ఆకుల స్నానం

ఈ రోజు విశిష్టమైన ఆచారం ఏమిటంటే.. తల పైన, భుజాల పైన ఏడు జిల్లేడు ఆకులు (లేదా చిక్కుడు ఆకులు) ఉంచుకుని నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయాలి.
ఆ ఏడు ఆకులు మన శరీరంలోని ఏడు చక్రాలకు సంకేతం.
ఈ స్నానం వల్ల గత జన్మ పాపాలు, ఈ జన్మలో తెలిసో తెలియక చేసిన దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

🔅 సూర్య నమస్కారాలు
ఈ రోజు చేసే సూర్య నమస్కారాలకు అత్యంత శక్తి ఉంటుంది. సూర్య కిరణాలు నేరుగా శరీరంపై పడటం వల్ల 'విటమిన్ డి' తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

🔅 చిక్కుడు పందిరి - క్షీరాన్నం
రథసప్తమి నాడు ఇంటి ముందు చిక్కుడు కాయలతో చిన్న రథం లాగా చేసి, సూర్య భగవానుడికి నైవేద్యంగా క్షీరాన్నం (పరమాన్నం) సమర్పిస్తారు. కొత్త బియ్యం, బెల్లం ఉపయోగించి ఆవు పాలతో తయారు చేసిన ఈ ప్రసాదాన్ని ఎండలో ఉంచి వండటం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది.
సూర్య అష్టకం / ఆదిత్య హృదయం
ఈ రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల శత్రువులపై విజయం, కార్యసిద్ధి కలుగుతాయి.

🔅🔅 ఈ ఏడాది (2026) రథసప్తమి జనవరి 25, ఆదివారం నాడు వచ్చింది. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజే రథసప్తమి రావడం మరింత విశేషం.

🙏 ఓం నమో సూర్యదేవాయ నమః 🙏

#RathaSaptami
#RathaSaptami2026
#SuryaJayanti
#MaghaSaptami
#రథసప్తమి
#సూర్యజయంతి
#SunGod
#SuryaBhagwan
#Suryashtakam
#AdityaHrudayam
#SuryaNamaskar
#Bhaktivideos
#LordSurya
#OmSuryaDevayaNamaha
#SpiritualJourney
#HinduFestival

8 months ago | [YT] | 15

Rajashekar Sharma

సకల విద్యా స్వరూపిణి, పరాశక్తి, జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికీ లభించాలని కోరుకుంటూ..

మిత్రులకు, శ్రేయోభిలాషులకు..

" వసంత పంచమి "
శుభాకాంక్షలు
💐💐🪷💐💐

🙏 శ్రీ మాత్రే నమః 🙏

#vasantpanchami #BasantPanchami #Saraswati #VasantPanchami2026 #saraswatipuja2026

8 months ago | [YT] | 44

Rajashekar Sharma

సభ్యులకు నమస్కారం..🙏
మన ఛానల్ లో వస్తున్న వీడియో పోస్టులకు సంబంధించిన ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే చెప్పగలరు.

11 months ago | [YT] | 10

Rajashekar Sharma

11 months ago | [YT] | 4

Rajashekar Sharma

కార్తీక మాసం సందర్భంగా మన ఛానల్ లో ఏ స్తోత్రానికి తెలుగు అర్థం కావాలనుకుంటున్నారు..?

11 months ago | [YT] | 15

Rajashekar Sharma

ఎంతటి అవరోధాలు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకండి..⚡

#truefacts #factsyoudidntknow #facts #FactsMatter #humanmentality #mentality #insprationalstory #RajaShekarSharma #todaybestphoto #krishna #mahabharat

1 year ago | [YT] | 8

Rajashekar Sharma

భగవద్దర్శనం, మహాత్ముల సూచనలు పాటించడం, అనవసర విషయాల జోలికి పోకపోవడం లాంటివి చేస్తే ఆధ్యాత్మిక పురోగతి, తద్వారా భగవదనుగ్రహం కలుగుతాయి. అలా అనుభవజ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం సాధకుడికి ఒక్క క్షణంలో లభించే వస్తువు కాదు.

ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి లక్షలు కూడబెట్టినట్లు సాత్వికానుభవంతో జ్ఞానం ప్రతిక్షణం ప్రవర్ధమానమవుతుంది. అలా పొందిన అనుభవ జ్ఞానానికి మించింది లేదు. దాని బలంతో సాధించలేనిది లేదు.

1 year ago | [YT] | 21

Rajashekar Sharma

రేపు కార్తీక పౌర్ణమి.."


ॐ ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు.
ॐ ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు.
ॐ ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది.
ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి.
ॐ ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి.
ॐ స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది.
ॐ మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.
అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు.
ॐ పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.
ॐ దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి.
ॐ యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం.
ॐ పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు.
ॐ కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి.
ॐ ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు.



హర హర మహాదేవ! శంభోశంకర హర!!


ॐ సర్వం శివమయం జగత్ ॐ


#ShivholicSharma #కార్తీకమాసం #శివోహం #కార్తీకపురాణం #ఓంనమఃశివాయ #karteekamasam #kartikamasam #kartikamasamdeepalu #kartikadeepam #karteekadeepam #karteekamasam2023 #kartikamasamspecial #IamShivholic #WeAreShivholics #MahadevFan #Mahakaal #kartikamasam2024 #thalapathranidhi #RajaShekarSharma #omnamahshivaya #harharmahadev #mahadev #mahadevstatus #karteekapournami


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩


🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏

1 year ago | [YT] | 56

Rajashekar Sharma

#శ్రీకార్తీక_పురాణము 8వ అధ్యాయము


|| శ్రీహరినామస్మరణ సర్వఫలప్రదము ||


ధర్మము మూడు రకాలు అవి సాత్విక, రాజస, తామసములు.
సాత్వికము అనగా దేశకాల పాత్రలు మూడునూ సమయాన సత్త్వామనే గుణము జనించి ఫలమంతా పరమేశ్వరార్పితము గావించి, మనోవాక్కయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతో ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్త పాపములు నాశనమొనర్చి పవిత్రలను చేసి దేవలోక సుఖములు చేకూర్చును.ఉదాహరంగా తామ్రపర్ణినది సముద్రంలో కలిసే తావునందు స్వాతికార్తెలో ముత్యపుచిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యంగ మారే విధంగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మము ఆచరిస్తూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ, దేవలయాలందూ వేదాలు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణుడు ఎంత స్వల్పదానము చేసినా లేక దేవాలంలో జపతపాదులు ఒనరించినను విశేషఫలమును పొందగలరు.
రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులు విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలను కలిగించునదగును.
తామస ధర్మమనగా శాస్త్రోక్తవిధులను విడివి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్ధము చేయు ధర్మము. ఆ ధర్మము ఫలమునీయదు.
దేశకాలపాత్రముల సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని ఏ స్వల్పధర్మమును చేసిననూ గొప్పఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించిన వారి సకల పాపములు పోయి ముక్తిపొంపుతారు. దీనికొక ఇతిహాసము కలదు.


|| అజామీళుని కథ ||


పుర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరంలో నాల్గువేదాలు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులు అని పేరు బడసిరి. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ బాలున్ని అతిగారబంగా పెంచుతూ, అజామీళుడని పేరు పెట్టరు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబం వలన పెద్దలను కూడ నిర్లక్ష్యంగా చూస్తూ, దుష్టసాహవాసములు చేస్తూ, విధ్యను అభ్యసించకుండా, బ్రాహ్మణధర్మలు పాటించక సంచరిస్తూండేవాడు. ఈ విధంగా కొంతకాలానికి యవ్వనంరాగా కామాంధుడై, మంచిచెడ్డలు మరచి, యజ్ణోపవితము త్రెంచి, మద్యన్ని సేవిస్తూ, ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుతూ, ఇంటికి రాకుండా, తల్లితండ్రులను మరచి, ఆమె ఇంట్లోనే భుజించేవాడు. ఆ విధంగా అజామీళుడు కులభ్రష్టుడు కాగా, అతని బందువులు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామీళుడు రెచ్చిపొయి వేటవలన పక్షులు, జంతువులను చంపుతూ కిరాతకవృత్తితో జీవిస్తుండెవాడు. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి, తరువాత అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకల దానికి అంతక ముందే ఒక కుమార్తె వుండెని. కొంత కాలనికి ఆ బాలికకు యుక్తావయస్సురాగా కామాంధకారంచే కన్నుమిన్నుగానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతూ వుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్బం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరు ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్కక్షణమైనా ఆ బాలున్ని విడువక ఎక్కడికి వెళ్లినా వెంటబెట్టుకొని వెల్తూ " నారాయణా - నారాయణా" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" అని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలానికి అజామీళునికి శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావుకి సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకర ఆకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామీళుడు భయము చెంది కుమారునిపై వున్న వత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" "నారాయణా" అంటు ప్రాణలు విడిచెను. అజామీళుని నోట "నారాయణా" అను శబ్దము వినబడగానే యమబటులు గడగడ వణకసాగిరి. అదేవెళకు దివ్య మంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కఫికి వచ్చి" ఓ యమభటులారా! వీడు మావాడు.మేము వీనిని వైకుంఠనికి తిసుకుపొవాడనికి వచ్చము" అని చెప్పి అజామీళుని వీమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవరు? వీడు అతిదుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవడానికి మేము వచ్చము కవున వానిని మాకు వపులుము అమి కోరగ విష్ణు దూతలు ఇలా చెప్పరు.


ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.


కార్తీక మాస ఎనిమిదవ రోజు దానధర్మ జపతపాది విధులు - ఫలితాలు
పూజించాల్సిన దైవము → దుర్గ
జపించాల్సిన మంత్రము → ఓం చాముండాయై విచ్చే స్వాహా
దానములు → తోచినవి, యథాశక్తి
నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
ఫలితము → ధైర్యం, విజయం



🙏🙏🙏 శివోహం 🙏🙏🙏


#ShivholicSharma #karteekamasam #kartikamasam #RajaShekarSharma #IamShivholic #WeAreShivholics #MahadevFan #కార్తీకమాసం #శివోహం #ఓంనమఃశివాయ #kartikamasamdeepalu #kartikadeepam #karteekadeepam #karteekamasam2024 #kartikamasamspecial #Mahakaal #thalapathranidhi #omnamahshivaya #harharmahadev #mahadev #mahadevstatus #karteekapournami


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩


౹౹ హరిఓం ౹౹


🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏

1 year ago | [YT] | 25