YSRCP Commanders

02.04.2026.
తాడేపల్లి.

పత్రికా ప్రకటన

మానవాళి కోసం జీసస్‌ మహాత్యాగమే గుడ్‌ ఫ్రైడే సందేశం.
:మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌.

కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్‌ ఇచ్చిన సందేశాలు అని శ్రీ వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.

#GoodFriday #YSJagan #YSRCP #AndhraPradesh

6 months ago | [YT] | 8

YSRCP Commanders

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్ మీట్‌

#YSJaganPressMeet #YSJagan #YSRCP #AndhraPradesh #YSJaganMohanReddy

7 months ago | [YT] | 81

YSRCP Commanders

𝗠𝗔- 𝗩𝗜- 𝗚𝗨𝗡: 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮, 𝗚𝘂𝗻𝘁𝘂𝗿

మచిలీపట్నంలో 𝗠𝗔, విజయవాడలో 𝗩𝗜, గుంటూరులో 𝗚𝗨𝗡 ఈ మూడు కలిస్తే, 𝗠𝗔𝗩𝗜𝗚𝗨𝗡 ఆనే గ్రోత్‌ కారిడర్‌ ఏర్పడుతుంది. ప్లాన్‌-బి కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించ లేదు. - మాజీ సీఎం శ్రీ వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి గారు.

#MaViGun #YSJaganPressMeet #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu #YSJagan #AndhraPradesh

7 months ago | [YT] | 145

YSRCP Commanders

ఏపీలో ఏ ప్రాంతానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు- మాజీ సీఎం శ్రీ వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి గారు .

#YSJaganPressMeet #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu #YSJagan #AndhraPradesh

7 months ago | [YT] | 192

YSRCP Commanders

07.01.2026.
తాడేపల్లి.

రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై మంత్రి మాటలు అవివేకానికి నిదర్శనం
:వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి.


రాయలసీమ లిఫ్ట్‌పై మంత్రికి కనీస అవగాహన లేదు
ప్రాజెక్ట్‌ అనవసరం అనడం రాయలసీమకు వెన్నుపోటు
కూటమి ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు పనులు జరగలేదు
రాయలసీమ ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్లు అబద్ధం
కమిషన్ల కోసం పాత బిల్లులు చెల్లించారు
దాంతో ఆ పనులు చేశామని చెప్పడం సిగ్గుచేటు
:ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ

దమ్ముంటే పూర్తి వివరాలు బయట పెట్టండి
అకిలపక్షంలో పనులు, ఖర్చుల వివరాలు చూపండి
:ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి:
రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై మంత్రి నిమ్మల రామానాయుడి మాటలు ఆయన అవివేకానికి నిదర్శనమని, ఆ ప్రాజెక్టుపై మంత్రికి కనీస అవగాహన లేదని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అనవసరం అనడమంటే అది రాయలసీమకు వెన్నుపోటు పొడవడమే అని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు పనులు జరగలేదన్న ఆయన, రాయలసీమ ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామనడం పచ్చి అబద్ధమని చెప్పారు. కమిషన్ల కోసం పాత బిల్లులు చెల్లించి, ఆ పనులు తామే చేశామని చెప్పడం సిగ్గుచేటని చురకలంటించారు. నిజంగా అలా నిధులు ఖర్చు చేసి ఉంటే, ఆ దమ్ము ప్రభుత్వానికి ఉంటే పూర్తి వివరాలు బయట పెట్టాలని, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఆ పనులు, ఖర్చుల వివరాలు చూపాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు ప్రచారం:
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లైనింగ్‌ పనులు తప్ప, ఏ ప్రాజెక్టు పనులూ జరగలేదు. అయినా తాము రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పడం హాస్యాస్పదం. అత్యంత హేయం. చివరకు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉన్నా, దాన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ అవసరం లేదన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాటలు, ఆయన అవివేకానికి నిదర్శనం. రాయలసీమ అవసరాలు గుర్తించిన గత ప్రభుత్వం.. 2024లో దిగిపోయే వరకు రాయలసీమ లిఫ్ట్‌ స్కీం పనులు శరవేగంగా కొనసాగించింది. ఆ పనులకు రూ.795 కోట్ల బిల్లులు కూడా చెల్లించింది. కావాలంటే మంత్రి రామానాయుడు ఎం బుక్‌లు తెప్పించుకుని చూడొచ్చు. తాను రాయలసీమ ద్రోహి కాదని చంద్రబాబు నిరూపించుకోవాలి. అందుకు కనీసం ఇప్పుడైనా ఆయన, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనపై వివరణ ఇవ్వాలి.

2024 వరకు నిర్విరామంగా ప్రాజెక్టు పనులు:
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను ఆపేశారు. అంతే తప్ప, మంత్రి రామానాయుడు ఆరోపిస్తున్నట్టు పనులేవీ 2020లో ఆగిపోలేదు. 2024లో మా ప్రభుత్వం దిగిపోయే వరకు ఆ స్కీం పనులు నిర్విరామంగా సాగాయి. మంత్రి ఒకసారి ఎం బుక్‌ (మెజర్‌మెంట్‌ బుక్‌) పరిశీలిస్తే, ఆయనకు అన్ని విషయాలు బోధ పడతాయి. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం దుర్మార్గం. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 85 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కేవలం పంపులు బిగించడం మాత్రమే మిగిలి ఉంది.

ఆ ప్రాజెక్టుతో చంద్రబాబుకే లబ్ధి:
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థకు అవసరం లేని పనులు అప్పగించి బిల్లులు చెల్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు. గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లింక్‌ పనులు రాయలసీమకు ఎంతో ఉపయోగకరం. మంత్రి వస్తే దాన్ని చూపడానికి మేము సిద్ధం. నిసానికి కుప్పంకు నీరు చేరాలంటే దాదాపు 620 కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. అది చాలా కష్టసాధ్యమైన పని. కానీ, నాడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చేపట్టిన జీఎన్‌ఎస్‌ఎస్‌– ßæచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లింక్‌ ప్రాజెక్టు పూర్తయితే కేవలం 120 కి.మీ మాత్రమే నీరు లిఫ్ట్‌ చేస్తే సరిపోతుంది. అదే కాకుండా 3.36 లక్షల ఎకరాలు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల పరిధిలోని ఎత్తయిన ప్రాంతాలకు నీరు సులువుగా చేరిపోతుంది. అందుకే ఆ ప్రాజెక్టు కోసం వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే రూ.1100 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. నిజానికి ఆ ప్రాజెక్టు పూరై్తతే ఎక్కువ లబ్ధిపొందేది కూడా చంద్రబాబే.

అవివేకంతో మంత్రి మాటలు:
రాయలసీమకు లిఫ్ట్‌ అసవరం లేదన్న మంత్రి రామానాయుడు మాటలు ఆయన అవివేకానికి నిదర్శనం. ఇరిగేషన్‌ శాఖ అధికారులతో ఎప్పుడైనా సమీక్ష చేసి ఉంటే ఆ మాట అనేవాడు కాదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల ఎత్తు నుంచే నీరు తోడేలా తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలిస్తుంటే, ఇక్కడ రాయలసీమ రైతులు బతకొద్దా? వారికి రాయలసీమ లిఫ్ట్‌ స్కీం మినహా వేరే ప్రత్యామ్నాయం ఉందా?.

రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు కుట్ర:
రాయలసీమ లిఫ్ట్‌ స్కీం పూర్తయితే జగన్‌గారికి మంచి పేరొస్తుందన్న అక్కసుతో నాడు కూడా రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రలు చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో కేసులు వేయించి పనులు అడ్డుకున్నాడు. నిజానికి ఆయనకు రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే, అలా అక్కడి ప్రజలకు మరణశాసనం రాసేవాడు కాదు. అదే దివంగత వైయస్సార్‌ దమ్మున్న నాయకుడు కాబట్టే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమ రైతులకు మేలు చేశారని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి వివరించారు.

#YSRCP #YSJagan #YSRCPGeneralSecretary #SVSatishKumarReddy #PressMeet #Pulivendula ‪#AndhraPradesh #YSRCPCommanders

9 months ago | [YT] | 256

YSRCP Commanders

పార్టీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి "శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం"

#YSRCP #YSJagan #YSJaganMohanReddy #PottiSriRamulu #AndhraPradesh #YSRCPCommanders

https://youtu.be/4Ow-2wHmAj8

10 months ago | [YT] | 202

YSRCP Commanders

తెలుగు వాడి పరువు తీసినా రామ్ మోహన్ నాయుడు

#AndhraPradesh #telugu #RamMohanNaidu #FlightCancellations #IndiGoCrisis #YSRCPCommanders

10 months ago | [YT] | 69

YSRCP Commanders

న్నర లక్షల ఉపాధి హామీ జాబ్‌ కార్డుల తొలగింపు.. మరోవైపు దాదా­పు ఐదున్నర కోట్ల పనిదినాల కోతలు.. ఇంకోవైపు లేబర్‌ కాంపొనెంట్‌ కింద నాలుగు నెలలకుపైగా ఉపాధి కూలీలకు వేతనాల బకాయిలు..! ఉపాధి పనులనే నమ్ముకున్న గ్రామీణ నిరుపేదలను చంద్ర­బాబు సర్కారు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. పనిదినాల్లోనూ కోతలు విధిస్తూ, చేసిన పనులకు వేతనాలు చెల్లించకుండా అగచాట్లకు గురి చేస్తోంది.
>గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు గత నాలుగున్నర నెలలుగా వేతనాలు (కూలి డబ్బులు) చెల్లించకపోవడంతో పేద­లు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. స్వయంగా టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర గ్రా­మీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు రూ.381 కోట్ల మేర ఉపా­ధి హామీ కూలి డబ్బుల బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై 27వతేదీ తర్వాత రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలెవరికీ వేతనాలు అందలేదని సమాచారం.
మూడో వంతు ఎస్సీ, ఎస్టీలే..
>చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో ఇటీవలే 18.63 ల­క్షల మంది జాబ్‌ కార్డు(7.48 లక్షల కుటుంబా­లు)లను తొల­గించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో లబ్ధి పొందుతున్న వారిలో మూ­డోవంతుకు పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలే ఉ­న్నా­యి. గతేడాది జూన్‌లో చంద్రబాబు ప్రభు­త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎ­న్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు రూ.వందల కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోతున్నా­యి. కూలి డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని వ్యవసాయ కారి్మక సంఘాలు వాపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దీపావళి సమయంలో నిరుపేదలు తాము చేసిన కూలి పనుల డబ్బుల కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ, అవి చేతికి అందకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నార
ఐదున్నర కోట్ల పని దినాలకు ఎసరు..!
>చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల కల్పన తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. వైఎస్‌ జగన్‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023–24లో రాష్ట్రంలో ఏప్రిల్‌ – నవంబరు మధ్య 21.37 కోట్ల పనిదినాల పాటు పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు 2025–26 ఏప్రిల్‌ – డిసెంబరు 7వతేదీ నాటికి కేవలం 15.94 కోట్ల పనిదినాలను మాత్రమే కల్పించింది. ఆర్నెలల్లో రూ.435.14 కోట్లు నష్టపోయిన పేదలు..
>రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌– సెపె్టంబరు మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన తగ్గించడం వల్ల అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఆర్నెలల్లో రూ.435.14 కోట్ల మేర నష్టపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్ధారించింది.
>2023–24లో గత ప్రభుత్వంలో ఉపాధి కూలీలు రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందగా 2024–25 లో రూ.6,183 కోట్లు మేర మాత్రమే ప్రయోజనం పొందారు.
జగన్‌ హయాంలో ఒక్క జిల్లాలోనే కూలీలకు రూ.2,700 కోట్లు
>రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2020–21లో ఉపాధి కూలీలకు వేతనాల రూపంలో రూ.731 కోట్ల మేర లబ్ధి చేకూ­ర్చింది. ఈ ఒక్క జిల్లాలోనే గత ప్రభుత్వం లేబర్‌ కాంపొనెంట్‌ కింద ఐదేళ్లలో రూ.­2,700 కోట్లకుపైగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించింది. అదే జిల్లాలో ఇప్పుడు సీఎం చంద్రబాబు సర్కారు 2024–25లో రూ.407 కోట్లు, ఈ ఆరి్థక ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు రూ.230 కోట్లు మాత్రమే కూలీ­లకు వేతనాలు చెల్లింపులు చేసింది.
#AndhraPradesh #YSRCP #YSJagan #YSJaganMohanReddy #YSJaganCares #YSRCPCommanders #YSJaganMarkGovernance

10 months ago | [YT] | 42