Power Telugu TV is an official YouTube channel where you can watch the latest breaking news, political updates, trending topics, exclusive interviews, and viral stories, with a primary focus on Andhra Pradesh and Telangana politics.
Our channel delivers timely news, insightful political discussions, and exclusive interviews that keep viewers informed about the latest developments. We also feature celebrity interviews and other engaging content, produced by an experienced team committed to delivering reliable and relevant information.
Subscribe to Power Telugu TV and never miss the latest news, political updates, exclusive interviews, trending stories, and special programs.
Power Telugu TV
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 'కూటమి' ప్రభంజనం..!
'93-95 శాతం స్ట్రైక్ రేట్'తో చారిత్రాత్మక విజయం.
మంత్రి నారా లోకేష్‌ను కలిసి అభినందనలు తెలిపిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.
2 days ago | [YT] | 71
View 2 replies
Power Telugu TV
Nara Lokesh : టీడీపీ నేత, మాజీ మంత్రి, ‘ఆళ్ల నాని’ గుండెపోటుతో మృతి చెందారనే సమాచారం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే నాని గారి స్మృతిలో నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
1 month ago | [YT] | 73
View 0 replies
Power Telugu TV
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. అధర్మాన్ని అడ్డుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మరో అవతారం శ్రీకృష్ణావతారం. కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధతో భగవద్గీతను అందించిన జగద్గురువు. మీకూ మీ కుటుంబానికి ఎల్లవేళలా శ్రీ కృష్ణుడి రక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణ జన్మాష్టమిని వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
2 months ago | [YT] | 199
View 0 replies
Power Telugu TV
పొగాకు రైతుల కోసం జగన్ వారసులు మద్యం బాటిల్స్ తో “సిద్ధం”.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
3 months ago | [YT] | 91
View 5 replies
Power Telugu TV
మంత్రి నారా లోకేష్ భుజం తట్టిన ప్రధాని మోదీ..!
'నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు.. శెహభాష్ లోకేష్' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రి నారా లోకేష్ భుజం తట్టారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం బయలుదేరిన ప్రధాని మోదీకి మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు.
ఆప్యాయంగా భుజం తట్టిన ప్రధాని మోదీ.. 'బాగా పనిచేస్తున్నావు..ఇదే వేగం, స్ఫూర్తితో పనిచేయాలని' మంత్రి నారా లోకేష్‌కు సూచించారు.
3 months ago | [YT] | 658
View 5 replies
Power Telugu TV
omorrow, the Alluri Sitarama Raju International Airport is going to be inaugurated in Bhogapuram, Andhra Pradesh.
Big boost to infrastructure! ✈️🛫🛬✈️
3 months ago | [YT] | 245
View 0 replies
Power Telugu TV
సూపర్ సిక్స్... సూపర్ హిట్...
రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధులు విడుదల. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ. తమ నలుగురు బిడ్డలకు సంబంధించి "తల్లికి వందనం" డబ్బులు తన భార్య ఖాతాల్లో పడ్డాయని సంతోషం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేసిన లబ్దిదారుడు వి.సుబ్బారావు.
#TallikiVandanam
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
3 months ago | [YT] | 38
View 1 reply
Power Telugu TV
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన మంత్రి లోకేష్
ఇటీవల ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. @naralokeshofficial @PawanKalyanAPDeputyCM
3 months ago | [YT] | 639
View 6 replies
Power Telugu TV
గుటుపల్లి రైతులకు పట్టాలు :
• ఈ ఏడాది మార్చి 9న గౌరవ ముఖ్యమంత్రి...డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటన సందర్భంగా వినతిపత్రం సమర్పించిన రైతులు.
• బేతంచెర్ల మండలం గుటుపల్లి గ్రామంలోని 215 సర్వే నంబర్లలో ఉన్న 2,669 ఎకరాల పట్టా, సర్వీస్ ఇనాం భూములు రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22A(1)(C) కింద వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారని రైతుల ఆవేదన
• భూములపై లావాదేవీలు చేయలేక పోతున్నామని, సమస్య పరిష్కరించాలని నాడు రైతుల వినతి.
• సమగ్ర పరిశీలన తర్వాత 426 ఎకరాల వక్ఫ్ భూములతో పాటు రైతుల పట్టా భూములు కూడా 2023 ఫిబ్రవరిలో నిషేధిత జాబితాలో చేర్చినట్లు గుర్తింపు. విచారణలో పట్టా భూములుగా నిర్ధారణ.
• అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, వక్ఫ్ బోర్డు సీఈఓకు ప్రతిపాదనలు..
• వక్ఫ్ బోర్డు 2,074 ఎకరాల పట్టా భూమిని 22A(1)(C) జాబితా నుంచి తొలగించాలని తీర్మానం. దీని ద్వారా 897 మంది రైతులకు ఉపశమనం.
• గౌరవ ముఖ్యమంత్రి ఆమోదంతో IGRS వెబ్సైట్ నుంచి 2,074 ఎకరాలను తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు ఇవ్వనున్న జిల్లా కలెక్టర్.
• గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో IGRS నుంచి సంబంధిత భూములను తొలగించి, ఉత్తర్వులను రైతులకు అందజేయనున్న జిల్లా రిజిస్ట్రార్.
బనగానపల్లె మండలంలో రైతులకు పట్టాలు :
• బనగానపల్లె నియోజకవర్గంలో 23 మంది రైతులకు సంబంధించిన 101 ఎకరాల చుక్కల భూములు క్రమబద్ధీకరించి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయం.
• ఇందులో బనగానపల్లె మండలంలోని 10 మంది రైతులకు చెందిన 50 ఎకరాల చుక్కల భూముల క్రమబద్ధీకరణ, తొలగింపు ఉత్తర్వులు అందించనున్న గౌరవ ముఖ్యమంత్రి.
3 months ago | [YT] | 291
View 2 replies
Power Telugu TV
పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్‌వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో & ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్ (Mr. Ryan Kang), బిజినెస్ స్ట్రాటజీ & ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్‌సన్‌లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#LokeshinSouthKorea
#NaraLokesh
3 months ago | [YT] | 282
View 0 replies
Load more