AB TV (Ani Beni tv)




AB TV (Ani Beni tv)

రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన CRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు

ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నవులూరు, కృష్ణాయపాలెం, పెనుమాక, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులకు శనివారం 2026 జూలై 18న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ ఐఏఎస్ గారు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు అందజేశారు. ల్యాండ్ పూలింగ్(LPS) కింద భూములిచ్చిన నవులూరు, కృష్ణాయపాలెం, పెనుమాక, కురగల్లు గ్రామాలకు చెందిన 33 మంది రైతులకు 76 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 46 రెసిడెన్షియల్ ప్లాట్లు కాగా, 30 కమర్షియల్ ప్లాట్లు.

ఈ కార్యక్రమం నిర్వహించిన కార్తీక్ గారు..రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్లు పొందిన రైతులు భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్(ల్యాండ్స్)- క్యాపిటల్ సిటీ కె.ఎస్.భాగ్యరేఖ, ప్లానింగ్ విభాగ డైరెక్టర్(FAC) బి.సురేష్ కుమార్, IT విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.సుధారాణి, పి.కృష్ణారావు, జి.సూర్యనారాయణ రెడ్డి, ప్లానింగ్, ల్యాండ్స్, GIS విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

2 months ago | [YT] | 66

AB TV (Ani Beni tv)

గుంటూరు జిల్లా...

*గుంటూరు కలెక్టరేట్ లో రైతులతో సమావేశం అయిన మంత్రి నారాయణ , తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ కుమార్*

*సమావేశానికి హాజరైన సీఆర్డీయే అదనపు కమిషనర్లు భార్గవ్ తేజ,కార్తీక్, కలెక్టర్ సాయికాంత్ వర్మ,రాజధాని ప్రాంత రైతులు*

*అమరావతి లో రైల్వేలైన్,ఇన్నర్ రింగ్ రోడ్డు కు అవసరమైన భూముల పై రైతులతో చర్చ*

*మోతడక, కంతేరు,తాడికొండ లో రైల్వే లైన్ కు అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని కోరుతున్న రైతులు*

*రైల్వే లైన్ కు రెండు వైపులా బఫర్ జోన్ కు ఎంత మేర భూమినీ ఎలా సేకరించాలని దానిపైనా చర్చ*

*......నారాయణ,మంత్రి కామెంట్స్....*

*రైల్వే ట్రాక్,ఇన్నర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణపై కీలక సమావేశం జరిగింది*

*మొదట ల్యాండ్ అక్విజిషన్‌కు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది*

*భూసేకరణ వల్ల తమకు నష్టమని రైతుల అభ్యంతరం వ్యక్తం చేశారు*

*ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు*

*సీఎం సూచన మేరకు రైతుల అభిప్రాయాలు తీసుకున్నాం*

*రైతుల సందేహాలన్నింటినీ సమావేశంలో అధికారులు నివృత్తి చేశారు*

*గ్రామసభలో మిగిలిన సందేహాలను నివృత్తి చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం*

*రైతుల అంగీకారంతోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తాం*

2 months ago | [YT] | 34

AB TV (Ani Beni tv)

*రాజధానిలో రివర్ ఫ్రెండ్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్*

*టూరిజం ప్రాజెక్టులపై ఎడిసిఎల్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష*

*రోడ్లు ,భవనాలు నిర్మాణం పూర్తయ్యేసరికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలి*



*అమరావతి:*
రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శుక్రవారం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారథి, సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతిలో అభివృద్ధి చేయనున్న పలు టూరిజం ప్రాజెక్టుల ప్రణాళికలు, అమలు పురోగతి, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమ్యూజ్‌మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాజధానిలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికే టూరిజం ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.టూరిజం ప్రాజెక్టుల కోసం ఇప్పటికే భూములు కేటాయించుకున్న సంస్థలు ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాజధాని అమరావతిని పర్యాటక రంగంలోనూ ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

2 months ago | [YT] | 38

AB TV (Ani Beni tv)

అమరావతి...

*నెదర్లాండ్స్ కు చెందిన స్టార్ నెట్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం*

*జెయింట్ వీల్స్ డిజైన్ ,నిర్మాణం లో ప్రసిద్ధి పొందిన స్టార్ నెట్ కంపెనీ*

*పలు దేశాల్లో భారీ జెయింట్ వీల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన స్టార్ నెట్ సంస్థ*

*అమరావతి ఐ ప్రాజెక్టు నిర్మాణంపై ఆసక్తి చూపిన స్టార్ నెట్ ప్రతినిధులు*

*ఇప్పటికే కృష్ణా నది ఒడ్డున అమరావతి ఐ పేరుతో దేశంలో అతిపెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం*

*మంత్రి నారాయణతో సమావేశంలో పాల్గొన్న స్టార్ నెట్ సీఈవో SMITS,ఎండీ జామా(Zama)*

2 months ago | [YT] | 29

AB TV (Ani Beni tv)

ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన ఐఐటీ ఖరగ్‌పూర్ బృందం

ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఎం.అమరనాథ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్(Transportation Engineering) డా.క్రాంతి కుమార్ కూన సోమవారం అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయపూడిలోని ADCL ప్రధాన కార్యాలయంలో వారు ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకై అభివృద్ధి చేస్తున్న LPS జోన్లు 12, 10, 9, 5Cలను వారిరువురు సందర్శించారు. సందర్శనలో భాగంగా LPS జోన్లలో రహదారుల నిర్మాణంలో పాటిస్తున్న విధానాలు పరిశీలించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ బృందానికి ఆయా ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు APCRDA ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను, ఆయా LPS జోన్లలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలను గురించి వివరించారు.

2 months ago | [YT] | 38

AB TV (Ani Beni tv)

అమరావతి హ్యాపీనెస్ట్ నిర్మాణ పనులలో 15 లక్షల సురక్షితమైన పనిగంటల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డిఏ) రాజధాని అమరావతి- అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌(AGC)లో నిర్మిస్తున్న ప్రాజెక్టులలో భాగంగా హ్యాపీనెస్ట్ నిర్మాణ పనులను NCC సంస్థ చేపట్టింది. "హ్యాపీ నెస్ట్" నివాస గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తంగా 12 టవర్లలో 1,200 అపార్ట్‌మెంట్ యూనిట్లను నిర్మిస్తున్నారు. ప్రతి టవర్‌లో గ్రౌండ్ + 18 అంతస్తుల (G+18) నిర్మాణం ఉంటుంది. NCC సంస్థ ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 15 లక్షల సురక్షితమైన పనిగంటలను ‘లాస్ట్ టైమ్ ఇంజరీ (LTI)’ లేకుండా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టులో సాధించిన ఈ మైలురాయి నిర్మాణ రంగంలో సిఆర్డిఏ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ మైలురాయి సాధించేందుకు నిర్మాణ ప్రాంతంలో సురక్షిత విధానాలకు కట్టుబడి పనిచేయడం, కార్మికులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు, ప్రాజెక్టులో అమలు చేస్తున్న ముందస్తు భద్రతా చర్యల కారణంగా ప్రమాదాలు జరగకుండా నిర్మాణ పనులు చేపట్టామని APCRDA అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి ఉద్యోగి, ఇతర భాగస్వాములకు ఏపీ సిఆర్డిఏ అభినందనలు తెలియజేస్తోందన్నారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు క్యాంపు సైటులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత సిబ్బందికి పలు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. సిఆర్డిఏ ESMU విభాగం, PgMC, PMC బృందం, NCC సంస్థ కాంట్రాక్టర్ బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఈ ప్రాజెక్టులో 15 లక్షల సురక్షితమైన పనిగంటల నమోదులో కీలకంగా వ్యవహరించినవారు:

AGICL సిఈ(సివిల్ -1): కె. నాగరాజు
APCRDA ఎస్ఈ: ఎం. చంద్రమోహన్ రావు
ఈఈ : ఎం. యజుర్వేద్ రెడ్డి
ప్రాజెక్టు డైరెక్టర్: ఎం.పరంజ్యోతి రాజు
కాంట్రాక్టర్ సంస్థ తరపున డిజిఎం : జి. బ్రహ్మనాయుడు
పిఎంసి : ఫీడ్‌బ్యాక్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.

2 months ago | [YT] | 45

AB TV (Ani Beni tv)

రైతుల సౌకర్యార్థం APCRDA అధికారిక వెబ్‌సైట్‌లో, యూనిట్ ఆఫీసుల వద్ద వార్షిక కౌలు వివరాలు

ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికై భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతుల సౌకర్యార్థం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) కీలక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు అందించే వార్షిక కౌలు(Annuity) చెల్లింపుల స్థితిగతులను పారదర్శకంగా తెలియజేసే ఉద్దేశంతో పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌(crda.ap.gov.in/APCRDAV2/views/Annuity_status.aspx)… పొందుపరచడం జరిగింది. అలాగే రాజధాని గ్రామాలలోని కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాల(LPS యూనిట్ ఆఫీసుల) వద్ద కౌలు చెల్లింపు వివరాలను ప్రదర్శించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం ప్రతి యూనిట్ ఆఫీస్ వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి రైతులకు వార్షిక కౌలు చెల్లింపుపై తలెత్తిన సందేహాలను APCRDA అధికారులు, సిబ్బంది వివరించడం జరుగుతోంది. అదే విధంగా సోమవారం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో రైతుల NPCI/ బ్యాంక్ లింకేజి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకుగాను హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ ద్వారా APCRDA సిబ్బంది..పలువురు రైతులకు NPCI లింకేజి ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది.

APCRDA వెబ్‌సైట్‌లో పొందుపర్చబడిన సమాచారంలో వార్షిక కౌలు జమ అయిన రైతుల వివరాలతో పాటు, ఇంకా కౌలు జమ కాని రైతుల వివరాలు, చెల్లింపులు నిలిచిపోవడానికి గల కారణాలను సైతం వెల్లడించడం జరిగింది. అలాగే NPCI (National Payments Corporation of India) వ్యవస్థలో ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలను కలిగిన రైతుల జాబితాను సైతం అందుబాటులో ఉంచడం జరిగింది.

రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతున్న నేపథ్యంలో, NPCI లింకేజీ సక్రమంగా లేకపోవడం లేదా బ్యాంకు ఖాతాలు ఇనాక్టివ్‌గా ఉండటం వంటి కారణాల వల్ల కొందరి ఖాతాలకు చెల్లింపులు జమ కావడం లేదు. అలాంటి రైతులు తమ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని APCRDA తరపున సూచిస్తున్నాము.

QR కోడ్ ద్వారా సులభంగా వివరాలు:
రైతులు తమ వార్షిక కౌలు చెల్లింపు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు APCRDA నుంచి QR కోడ్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత వెబ్‌పేజీలో రాజధాని రైతులు తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే కౌలు లబ్ధి సమాచారం తెలుసుకునే సౌకర్యం కల్పించబడింది. కౌలు లబ్ధి పొందని రైతులు తమ పేర్లు, ఖాతా వివరాలు.. ఏ కారణం చేత కౌలు జమ కాలేదోనన్న అంశాలను సైతం చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ ఖాతాలలో కౌలు నగదు జమ చేయుట సాధ్యపడదు కనుక ఆధార్ ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలు కలిగిన రైతులు వెంటనే ఆ ఖాతాలను యాక్టివేట్ చేసుకోగలరని కోరుచున్నాము.

2 months ago | [YT] | 27